సంగమేశ్వరం టెండర్లు ఆపండి

సంగమేశ్వరం టెండర్లు ఆపండి

ఎట్టకేలకు కేఆర్ఎంబీకి లెటర్ రాసిన రాష్ట్ర సర్కార్
విభజనచట్టా నికి వ్యతిరేకంగాఏపీప్రాజెక్టు చేపడుతోంది
కేఆర్ఎంబీ, సీడబ్ల్ యూసీఅనుమతివచ్చే వరకూఅడ్డు కోవాలి
టెండర్ల ప్రక్రియపూర్తయితేకొర్రీలుపెట్టే అవకాశంఉంది
వెంటనేచర్యలుతీసుకోవాలని కోరిన ఈఎన్ సీ

హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం చేపడుతోన్న సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీంపై ఎట్టకేలకు రాష్ట్ర సర్కారు స్పందించింది. రీ ఆర్గ‌నైజేషన్ యాక్ట్ కు విరుద్ధం గా ఏపీ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టు టెండర్ ప్రక్రియను అడ్డుకోవాలంటూ కేఆర్ఎంబీని కోరింది. ఈ మేరకు సోమవారం ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్.. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ హరికేశ్ మీనాకు లెటర్ రాశారు. ఏపీ మే
5న జారీ చేసిన జీవో 203పై కేఆర్ఎంబీకి అదే నెల 12న కంప్లైంట్ చేశామని, ఈ ప్రాజెక్టు టెండర్లు సహా ఎలాంటి ప్రక్రియ చేపట్టకుండా నిలుపుదల చేయాలని కోరామని గుర్తు చేశారు. సంగమేశ్వరం లిఫ్టుతో పాటు పోతిరెడ్ డిపాడు హెడ్ రెగ్యు లేటర్ కెపాసిటీని 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులను అడ్డుకోవాలని కోరామని తెలిపారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టుల విషయంలో ఏపీ ముందుకే వెళ్తుందని, ఇప్పుడే నిలువరించాలని కోరింది.

వెంటనే చర్యలు చేపట్టండి

కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ టెక్నికల్ అప్రైజల్, అపెక్స్ కౌన్సిల్ అనుమతి వచ్చే వరకు సంగమేశ్వరం, పోతిరెడ్ డిపాడు విషయంలో ముందుకెళ్లొద్దని కేఆర్ఎంబీ మే 20న ఏపీని ఆదేశించిందని ఈఎన్సీ గుర్తుచేశారు. జులై 1న ఏపీ తలపెట్టిన ప్రాజెక్టుల డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు(డీపీఆర్లు) ఇవ్వాలని కోరారని, ఏపీ ప్రభుత్వం ఎలాంటి వివరాలు ఇవ్వకుండానే ఈ ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను చేపట్టిందన్నారు. ఎస్సార్బీసీ నంద్యాల సర్కిల్ ఎస్ఈ ఈ నెల 15న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారని, ఏపీ ప్రభుత్వం టెండర్లప్రక్రియను పూర్తి చేస్తే ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టుల పనులు మొదలు పెడుతుందని పేర్కొన్నారు.

అదే జరిగితే కృష్ణా బేసిన్ లోని తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లుతుం దని తెలిపారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తే పనులు దక్కించుకున్న వర్క్ ఏజెన్సీల నుంచి లీగల్ ఇష్యూస్ తలెత్తుతాయని ఏపీ వాదించే అవకాశముందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన టెండర్ల ప్రక్రియను ఆపుతూ వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాజెక్టులకు కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు వచ్చే వరకూ చేపట్టకుండా అడ్డుకోవాలని కోరారు. తమ లేఖను సీరియస్ గా పరిగణించి వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ..