గండిపేట, వెలుగు: ఎస్‌ఎంపీ యూనివర్సల్ స్కూల్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన శ్రీమద్భగవద్గీత మహాయజ్ఞాలు బుధవారం ముగిశాయి. జగద్గురు శంకరాచార్య అభినవోద్ధండ నృసంహ భారతి శిష్యులు కొరగంజి గణపతిరావు, కె.లక్ష్మీకాంతం దంపతులు ఈ కార్యక్రమం నిర్వహించారు. 18 మంది టీటీడీ వేద పండితుల మంత్రోచ్ఛరణలతో పాఠశాల ప్రాంగణం మారుమోగింది. యజ్ఞం చివరి రోజు వేంకటేశ్వర స్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది.
ఎమ్మెల్యే మల్లారెడ్డి, ప్రకాశ్గౌశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ పట్లోళ్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్కూల్ ప్రాంగణంలో మహాయజ్ఞం నిర్వహించడం పూర్వజన్మ సుకృతమన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
