
ఇంటర్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌ను అప్డేట్ చేయాలె
నవీన్ మిట్టల్‌కు టిప్స్ వినతి
హైదరాబాద్, వెలుగు : ఉద్యోగుల సీనియారిటీ లిస్ట్, పోస్టుల మంజూరు, కాలేజీల డేటాతో ఇంటర్మీడియెట్ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌ను అప్డేట్ చేయాలని ఇంటర్ఎడ్యుకేషన్ ఇన్చార్జ్కమిషనర్నవీన్మిట్టల్ను తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) నేతలు కోరారు. సైట్లో వివిధ లెటర్లు, సర్క్యులర్లు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం టిప్స్ ప్రతినిధులు నవీన్ మిట్టల్‌ను కలిశారు. డీఐఈవో/నోడల్ఆఫీసర్ పోస్టు రాష్ట్ర స్థాయిదని, ప్రిన్సిపాళ్ల ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్ట్ ప్రకారం మాత్రమే ఆ పోస్టు ఇవ్వాలని కోరారు. ఇంటర్ బోర్డులో డిప్యూటేషన్లు, ఓడీల రూపంలో ఇచ్చే పోస్టులను ప్రిన్సిపాల్స్, జూనియర్ లెక్చరర్ల సీనియారిటీ ప్రకారమే ఇవ్వాలన్నారు.
నాన్‌టీచింగ్ సిబ్బందికి 10% కోటా కింద జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పేద స్టూడెంట్లు కట్టిన ఫీజులతో ఫుడ్అలవెన్స్, రెమ్యునరేషన్లను తీసుకుంటూ అధికారులు బోర్డు నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, బోర్డు రూల్స్ ప్రకారం చెల్లించేలా చూడాలని కోరారు. కమిషనర్‌ను కలిసినవారిలో టిప్స్ప్రతినిధులు మాచర్ల రామకృష్ణ గౌడ్, మైలారం జంగయ్య, డాక్టర్ కొప్పిశెట్టి సురేశ్, రవీందర్ రెడ్డి, బి.లక్ష్మయ్య, దుర్గాప్రసాద్, డాక్టర్ వస్కుల శ్రీనివాస్, శోభన్ బాబు, అలీ, వెంకటేశ్ ఉన్నారు.