
హైదరాబాద్ : చింతల్ పరిసర ప్రాంతాల గుండా ప్రయాణించేవారికి ట్రాఫిక్ పోలీసులు ఓ సూచన చేశారు. చింతల్ మార్కెట్ వద్ద ట్విన్సు బాక్స్ కల్వర్టుపై జీహెచ్ఎంసీ పనుల కోసం నెల రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జీహెచ్ఎంసీ ఏప్రిల్ 28 నుంచి నెల రోజుల పాటు పనులు చేపట్టనుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు ఆ ప్రాంతంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు. రద్దీని నివారించడానికి తిగిన ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించుకోవాలని ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
* చింతల్ మెయిన్ రోడ్డు నుంచి పద్మానగర్ రింగ్ రోడ్డు వైపు ట్రాఫిక్.. ఎల్లమ్మ దేవాలయం-..- ఎడమ వైపు- ..వాణి నగర్- కుత్బుల్లాపూర్ గ్రామం వద్ద మళ్లించబడుతుంది.
* పద్మానగర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్ ను మాణిక్య నగర్ కమాన్-, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పాండు విగ్రహ, చింతల్ ప్రధాన రహదారిపై మళ్లిస్తారు.
* పద్మానగర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్ ఫైన్ చికెన్ మార్కెట్, -అంబేడ్కర్ నగర్ రోడ్డు, అంబేడ్కర్ విగ్రహం -కుడివైపు, రాంరెడ్డి నగర్ రెయిన్ బో హైస్కూల్ ఐడీపీఎల్ మెయిన్ రోడ్డు వద్ద మళ్లించబడుతుంది.
పనులు త్వరగా పూర్తి చేసేందుకు ప్రయాణికులు, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.