వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. టికెట్ల రీషెడ్యూల్ కు ఛాన్స్

వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. టికెట్ల రీషెడ్యూల్ కు ఛాన్స్

తిరుమల: కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు భక్తులకు తీపికబురు అందించింది. ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు టికెట్లు కలిగిన భక్తులు.. తమ దర్శన టికెట్లు మార్చుకునే వెసులుబాటు కల్పించింది. డిసెంబరు నుంచి 2022 మే వరకు నచ్చిన తేదీల్లో టికెట్లను రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. టీటీడీ వెబ్‌సైట్‌లో దర్శన తేదీలను మార్చుకోవడంతో పాటు.. కొత్త టికెట్లను పొందే అవకాశం కల్పించింది. ఆరు నెలల్లోపు ఎప్పుడైనా పాత దర్శనం టికెట్లతో.. నూతన టికెట్లు పొందవచ్చని స్పష్టం చేసింది. రెండు ఘాట్‌ రోడ్లలో వాహనాలను అనుమతిస్తున్నామని పేర్కొంది. ఘాట్‌ రోడ్డు ప్రాంతాల్లో.. పాడైన రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలిపారు. ఘాట్ రోడ్ల‌లో ర‌వాణాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అలిపిరి కాలిన‌డ‌క మార్గంలో అనుమ‌తిస్తున్నామని.. భ‌క్తులు నిర్భయంగా వ‌చ్చి శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చని వివరించారు.