రఘుకుంచె లీడ్ రోల్‌లో చైతన్య మోటూరి రూపొందించిన చిత్రం ‘గేదెల రాజు’. వాణి రవికుమార్ మోటూరి నిర్మించారు. ఈనెల 24న సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు చైతన్య మోటూరి మాట్లాడుతూ ‘కాకినాడ పరిసర ప్రాంతాల్లో రౌడీల గురించి నాకు తెలిసిన విషయాలు, స్థానికంగా జరిగిన ఘటనలు కలిపి ఈ కథ రాసుకున్నా. డెయిర్ ఫామ్ నడిపే గేదెల రాజు అనే రౌడీ షీటర్‌గా రఘు కుంచె రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే ఆయన అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్.
మాకున్న బడ్జెట్‌లో హై క్వాలిటీ సౌండింగ్ ఇచ్చారు. నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో సాగే మర్డర్ మిస్టరీ స్టోరీ ఇది. గతంలో జరిగినవి చూపిస్తూ మర్డర్ మిస్టరీ కథను ఆసక్తికరంగా తెరకెక్కించాను. ఇందులో రెండు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ కూడా చూపిస్తున్నాం. మొత్తం ఐదు కథలు గేదెలరాజు చుట్టూ జరుగుతుంటాయి. చూస్తే ఒకటే నిజం, చూడకపోతే వంద అనుమానాలు అనే క్యాప్షన్ కూడా మా మూవీకి పర్పెక్ట్‌గా సూట్ అవుతుంది. కథలోని ట్విస్ట్ ను ఎవరూ కనిపెట్టలేరు. ప్రతి పాత్ర మీరు ఎక్కడో చూసినట్లు, విన్నట్లు ఉంటుంది’ అని చెప్పాడు.

