వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న సన్నిధిలో నాదబ్రహ్మ లయ బ్రహ్మసద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు ఈ నెల 8 నుంచి ప్రారంభమై ఐదు రోజుల పాటు 12 వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో సుప్రసిద్ద కళాకారులు శాస్ర్తీయ, భక్తి, సంగీత, జంత్రవాద్య, సోలో, హరికథ, నృత్య, హరికథ, నాటక, ఉపన్యాస, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలుంటాయని నిర్వాహకులు తెలిపారు.
ఉత్సవాల నిర్వహణకు భీమేశ్వర సదన్‌లో ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేములవాడ ఆలయంలో 72 ఏళ్లుగా ఏటా ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. కర్నాటక సంగీతంలో ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజు రచించిన రామకీర్తనలు ఎంతో గుర్తింపునిచ్చాయి. ఆయన జన్మదినాన్ని సంగీత దినంగా ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు.
