తెలంగాణ ఇవ్వలే.. గుంజుకున్నం

తెలంగాణ ఇవ్వలే.. గుంజుకున్నం

హైదరాబాద్: కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అని తెలిపారు మంత్రి కేటీఆర్. రాహుల్ గాంధీ మాటలపై స్పందించిన మంత్రి.. కాంగ్రెస్ కు 50 ఏళ్లు అవకాశం ఇచ్చినా  సమస్యలు తీరలేదన్నారు. రాజ్యాంగేతర శక్తిగా ఇష్టారాజ్యంగా చెలరేగింది సోనియా కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే రిమోట్ కంట్రోల్ పాలన అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికి రేవంత్ ను పక్కన పెట్టుకుని అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరం అన్నారు. రాహుల్ పక్కన ఉన్న పీసీసీ చీఫ్ ఓ దొంగ అన్నారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తే కాంగ్రెస్ వాళ్లు రోడ్లపై తిరిగేవాళ్లా అన్నారు. వరంగల్ సభలో మాట్లాడిన రాహుల్ ఒకేసారి రుణమాఫీ ఇస్తామన్నారు.. కానీ ఒకేసారి రైతు రుణమాఫీ సాధ్యం కాదన్నారు. ఎవరికో తొత్తులుగా ఉండాల్సిన అవసరం మాకు లేదన్నారు. స్ట్రప్ట్ చదవడం తప్ప రాహుల్ కు ఏం తెలుసన్న కేసీఆర్.. రాహుల్ మాటలు నమ్మడానికి ఇది టెన్ జన్ పథ్ కాదన్నారు. తెలంగాణ ఇవ్వలే...గుంజుకున్నం అన్నారు.

కుంభకోణాల్లో కూరుకుపోయిన దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ అన్నారు.  వ్యవసాయానికి పాతర వేసింది కాంగ్రెస్ అయితే .. వ్యవసాయాన్ని జాతర చేసింది టీఆర్ఎస్ అన్నారు. అమేథిలొ తంతే కేరళలో పడ్డ రాహుల్ ఇక్కడికొచ్చి ప్రచారం చేస్తే నమ్మేందుకు ప్రజలు రెడీగా లేరని తెలిపారు. సీఎం కేసీఆర్ ను క్షమించను అనడానికి నువ్వు ఎవడివి అన్న కేటీఆర్.. గాంధీ భవన్ ను గాడ్సేకు అప్పగించారన్నారు. ఎఐసీసీ అంటే ఆలిండియా కాంగ్రెస్ క‌మిటీ కాదు, ఆలిండియా క్రైసిస్ క‌మిటీ అన్నారు.  నాయ‌న‌మ్మ‌, నీ నాయ‌న‌, మీ ముత్తాత‌కు అధికారం ఇచ్చిన‌ప్పుడు ఏం వెల‌గ‌బెట్టారన్న కేటీఆర్..మ‌మ్మీ చేతిలో రిమోట్, డ‌మ్మీ చేతిలో పాల‌న  అన్నారు. కాంగ్రెస్ పేరే స్కాంగ్రెస్ క‌దా, A టు Z అన్నీ కుంభ‌కోణాలే క‌దా అన్నారు మంత్రి కేటీఆర్.