
రెండు దశాబ్దాల తర్వాత ఇండియాలో ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. 2030 కామన్వెల్త్ క్రీడల (CWG) కోసం బిడ్ సమర్పించాలన్న యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం బుధవారం (ఆగస్టు 27) ఆమోదించింది. భారత్‌లో ఈ క్రీడలు నిర్వహించే అవకాశం అహ్మదాబాద్ కు దక్కనుంది. హోస్ట్ సహకార ఒప్పందం (HCA)పై సంతకం చేయడంతో పాటు గుజరాత్ ప్రభుత్వానికి అవసరమైన గ్రాంట్-ఇన్-ఎయిడ్‌ను మంజూరు చేయడానికి కూడా ఆమోదం తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ సూచనల ప్రకారం 2036 ఒలింపిక్స్‌ను కూడా మన దేశంలో నిర్వహించాలనే యోచన ఉంది. ఇందు కోసం కూడా ప్రాధమికంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. 2010లో భారత్‌లో కామన్వెల్త్ క్రీడలకు జరిగాయి. కామన్వెల్త్ క్రీడల్లో 72 దేశాల నుండి అథ్లెట్లు పాల్గొంటారు. క్రీడల సమయంలో ఇండియాను సందర్శించే అథ్లెట్లు, కోచ్‌లు, సాంకేతిక అధికారులు, పర్యాటకులు, మీడియా వ్యక్తులు వంటి పెద్ద సంఖ్యలో పాల్గొనడం వల్ల స్థానిక వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుతుంది. దీంతో పాటు ఆదాయం కూడా లభిస్తుంది.
►ALSO READ | 2019 World Cup: తీవ్ర ఒత్తిడిలో ధోనీ ఆ బాల్ వదిలేయడం ఆశ్చర్యానికి గురి చేసింది: ఫెర్గుసన్
అహ్మదాబాద్ లో ప్రపంచ స్థాయి స్టేడియాలు, అత్యాధునిక శిక్షణా సౌకర్యాలు, క్రీడా సంస్కృతిని అందించే ఆదర్శవంతమైన నగరంగా పేరుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియంలో 2023 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ గ్రాండ్ గా నిర్వహించి తమ సామర్ధ్యాన్ని చాటుకుంది.
ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడం వల్ల పర్యాటకం వృద్ధి.. ఉద్యోగాలు సృష్టించడంతో పాటు లక్షలాది మంది యువ అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుంది. అంతేకాకుండా, స్పోర్ట్స్ సైన్స్, ఈవెంట్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్ట్ కోఆర్డినేటర్లు, బ్రాడ్‌కాస్ట్, మీడియా, IT, కమ్యూనికేషన్లు, పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనికేషన్లు లాంటి రంగాలలో కూడా పెద్ద సంఖ్యలో నిపుణులు అవకాశాలను పొందుతారు.