
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌కు కౌంటర్‌గా గురువారం (మే 8) రాత్రి పాక్ భారత్‌పై దాడులకు పాల్పడటం, పాక్ దాడులకు భారత్ కౌంటర్ ఎటాక్ ఇచ్చిన వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ శుక్రవారం (మే 9) మీడియాకు వెల్లడించింది. కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా, విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ మీడియాకు బ్రీఫింగ్ చేశారు. గురువారం (మే 8) రాత్రి భారత పశ్చిమ సరిహద్దు ప్రాంతంపై పాక్ దాడులకు దిగింది.
భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డాడులకు ప్రయత్నించింది. భారత్‌లోని నాలుగు ఎయిర్ పోర్టులు లక్ష్యంగా పాకిస్థాన్ డ్రోన్లు ప్రయోగించింది. లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు మొత్తం 36 చోట్ల దాడులకు పాల్పడింది. కైనటిక్, నాన్ కైనటిక్ సాధనాలతో పాక్ దాడులను భారత్ తిప్పికొట్టింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేశాం. ప్రస్తుతం ఆ డ్రోన్ల పరిశీలన జరుగుతోంది. అవి టర్కీకి చెందిన డ్రోన్లుగా గుర్తించాం. భటిండా సైనిక స్థావరంపై దాడికి ప్రయత్నం జరిగింది.
కశ్మీర్ లోని తంగ్దర్, యూరీలో పాక్ దాడులకు తెగబడింది. పాక్ దాడులకు కౌంటర్ భారత్ ప్రతి దాడులు చేసింది. భారత్ చేసిన కౌంటర్ ఎటాక్ లో పాక్ కు తీవ్ర నష్టం వాటిల్లింది. పౌరవిమానాలను కవచంగా ఉపయోగించుకుని పాక్ దాడులకు పాల్పడుతోంది. ఎల్వోసీ వెంబటి పాక్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. బోర్డర్లో భారీ ఆర్టిలరీలతో పాక్ కాల్పులు జరుపుతోంది. పాక్ యుద్ధ విమానాలు పరిధి ధాటి భారత్ లోకి ప్రవేశించగా వాటిని కూల్చేశామని వెల్లడించారు.