
ఆదిపురుష్(Adipurush) సినిమాలోని కొన్ని డైలాగ్స్ పై విమర్శలు వస్తున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల సూచనలను గౌరవిస్తూ ‘ఆదిపురుష్’ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ మార్చబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు మేకర్స్. మరి కొద్ది రోజుల్లోనే ఈ మార్పులతో థియేటర్స్ లో ‘ఆదిపురుష్’ ను చూడవచ్చు’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రేక్షకుల మనోభావాలు, వారి సెంటిమెంట్స్, సూచనలు గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు దర్శకనిర్మాతలు పేర్కొన్నారు.
ఆదిపురుష్ సినిమాలో ఒక సన్నివేశంలో హనుమాన్(Hanuman) పాత్ర చెప్పే డైలాగ్స్ నెట్టింట పెద్దఎత్తున ట్రోల్ అవుతున్నాయి. భారతీయులు అతి పవిత్రంగా భావించే రామాయణంలో ఇలాంటి సంభాషణలు పెట్టడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ఆ డైలాగ్స్ ను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) శ్రీరాముడి పాత్రలో నటించిన ‘ఆదిపురుష్’ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om Raut) తెరకెక్కించాడు. జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు.. తొలిరోజు నుండే మిశ్రమ స్పందన వచ్చింది