ఇండియాలో ఉన్న అమెరికన్లు త్వరగా రండి

ఇండియాలో ఉన్న అమెరికన్లు  త్వరగా రండి

భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజు వారీ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటుతోంది. దీంతో  వీలైనంత త్వరగా భారత్ నుంచి వచ్చేయాలని తమ దేశ పౌరులను ఆదేశించింది అమెరికా. ఈ మేరకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ ఆఫైర్స్  ప్రకటన చేసింది. భారత్‌లో కరోనా  కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా అనారోగ్యానికి గురైతే వైద్యం పొందడం అంత సులువు కాదని హెచ్చరించింది.  అందుకే  భారత్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశించింది. అంతేగాకుండా  లెవల్ 4 హెచ్చరికలు కూడా జారీ చేసింది. అందుబాటులో ఉన్న విమానాలకు యూఎస్ వచ్చేయాలని  సూచించింది. నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో లేకపోతే వయా పారిస్, ఫ్రాంక్‌ఫర్ట్ ద్వారా స్వదేశానికి చేరుకోవాలని తెలిపింది. అలాగే అమెరికా నుంచి భారత్‌కు ప్రయాణాలు బంద్ చేసుకోవాలని హెచ్చరించింది.