వెరైటీ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో బధాయీ దో

వెరైటీ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో బధాయీ దో

మనవళ్లను ఎత్తుకోవాల్సిన వయసులో మరో బిడ్డకు జన్మనివ్వాల్సి వస్తే అనే వెరైటీ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘బధాయీ హో’ సినిమా సూపర్ సక్సెస్‌‌‌‌‌‌‌‌ని అందుకుంది. ఈ మూవీకి స్పిరిట్యువల్ సీక్వెల్‌‌‌‌‌‌‌‌గా వస్తోన్న మూవీ ‘బధాయీ దో’. రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్ రావ్, భూమి పెడ్నేకర్ జంటగా  హర్షవర్థన్ కులకర్ణి రూపొందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11న థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో రిలీజ్ కానుంది. నిన్న ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. సేమ్ జెండర్‌‌ని ఇష్టపడే హీరోహీరోయిన్స్ ఇంట్లో పెద్దల సంతోషం కోసం, చుట్టూ ఉన్న సమాజం కోసం పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వారికి ఎదురయ్యే పరిస్థితులే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. అబ్బాయిలతో రిలేషన్‌ని కోరుకునే పోలీస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాజ్‌‌‌‌‌‌‌‌ కుమార్ రావ్, మరో అమ్మాయితో డేటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తోన్న స్కూల్ టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా భూమి పెడ్నేకర్ నటిస్తున్నారు. ఇదో సెన్సిటివ్‌‌‌‌‌‌‌‌ ఇష్యూ అయినప్పటికీ ‘బధాయీ హో’ తరహాలోనే, ఫ్యామిలీ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో ఫుల్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసినట్టు ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా అర్థమవుతోంది. ఆ సినిమా రైటర్స్ సుమన్ అధికారి, అక్షత్ గిల్డియాల్ దీనికీ వర్క్ చేశారు. క్రోమ్‌‌‌‌‌‌‌‌ పిక్చర్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి జంగ్లీ పిక్చర్స్‌‌‌‌‌‌‌‌ సంస్థ నిర్మిస్తోంది.