అకో జనరల్ ఇన్సూరెన్స్, యూ గవ్ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం మనదేశంలో 2030 నాటికల్లా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వినియోగం పెరిగే అవకాశం ఉందని తేలింది. ఈవీ వాహనాలంటే ఇంట్రెస్ట్ ఉన్న 1018 మందిపై ఈ సర్వే చేశారు. వాళ్లలో ఇప్పటికే ఈ– వెహికల్స్ వాడుతున్నవాళ్లు, ఫ్యూచర్లో కొనాలనుకుంటున్నవాళ్లు ఉన్నారు. అయితే పెట్రోల్, డీజిల్ కార్ల బదులుగా విద్యుత్తు వాహనాలును వినియోగించడంపై వాళ్ల వాళ్ల అభిప్రాయాలను ఇలా చెప్పుకొచ్చారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సామాన్య ప్రజలపై ప్రభావం చూపెడుతుంది. దానివల్ల చాలామంది ఈవీలకు మారే అవకాశం ఉంటుంది. అయితే, వాహనాలకు ఛార్జింగ్ సదుపాయాల కొరతపై చాలామంది వినియోగదారుల్లో ఆందోళన ఉంది. అంతేకాకుండా ఈ మధ్య ఎలక్ట్రానిక్ వాహనాల్లో బ్యాటరీలు దెబ్బతిని కాలిపోయిన సంఘటనలు కూడా కస్టమర్లను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
టెక్నాలజీతో అప్‌డేట్ కావాలని కొందరు ఈవీ కార్లను కొంటుంటే, మరికొందరు పొల్యూషన్ నుంచి పర్యావరణాన్ని కాపాడాలని ఎలక్ట్రానిక్ వాహనాలను కొంటున్నట్టు చెప్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలు, వాహనాలు సర్వీస్‌లు, ఛార్జింగ్ స్టేషన్లు, బిల్ట్ క్వాలిటీపై కంపెనీలు దృష్టి పెట్టాలని కొందరు కోరారు.
