పాతికేళ్ళ క్రితం నాటి ఊరుని రీ క్రియేట్ చేశాం

పాతికేళ్ళ క్రితం నాటి ఊరుని రీ క్రియేట్ చేశాం

నాని హీరోగా తెరకెక్కిన ‘దసరా’ చిత్రం కోసం గోదావరిఖని బొగ్గు గనుల మధ్య ఉండే ఓ గ్రామాన్ని.. సెట్‌‌‌‌‌‌‌‌ రూపంలో రీ క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేశారు ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీ మార్చి 30న విడుదలవుతున్న సందర్భంగా అవినాష్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ‘తెలంగాణలోని కోల్ మైన్‌‌‌‌‌‌‌‌కు దగ్గరగా వుండే ఓ గ్రామంలో జరిగే కథ ఇది. తెలంగాణ కల్చర్, అలవాట్లు, కట్టుబాట్లు కనిపించే  ఒక పాతికేళ్ళ క్రితం నాటి ఊరుని రీ క్రియేట్ చేశాం. అందుకోసం 22 ఎకరాల్లో భారీ విలేజ్ సెట్ వేశాం.

ఇల్లు, స్కూల్, ప్లే గ్రౌండ్, బార్ సెట్స్‌‌‌‌‌‌‌‌తో ఆ గ్రామాన్ని  క్రియేట్ చేశాం. మైనింగ్‌‌‌‌‌‌‌‌కి చుట్టుపక్కల వున్న గ్రామాల్లో ఎలా ఉంటుందో చూసి నేచురల్‌‌గా ఉండేలా సెట్స్‌‌‌‌‌‌‌‌ వేశాం. మొత్తం సెట్ వేయడానికి రెండున్నర నెలలు పట్టింది. దాదాపు 800 మందికి పైగా పని చేశారు. సినిమాలో 98 శాతం షూటింగ్ ఇక్కడే జరిగింది. ట్రైన్ సీక్వెన్స్ కూడా అక్కడే తీశారు. సెట్‌‌‌‌‌‌‌‌లో ప్రతి రోజు మూడు వందల మంది ఉన్నా.. వాళ్లెవరికీ అది సెట్ అని తెలీదు. ఎలక్ట్రిసిటీ బోర్డ్ వాళ్ళు కూడా సెట్‌‌‌‌‌‌‌‌ అని చెబితే నమ్మలేదు. అంత రియలిస్టిక్‌‌ ఉండే సెట్ వేశాం’ అన్నారు.