
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja ) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. యువతలో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రవితేజ నుండి..ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్న మూవీ టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageshwar Rao). రీసెంట్గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయినా టీజర్, పోస్టర్స్, సాంగ్స్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాయి.
ఇక లేటెస్ట్గా టైగర్ నాగేశ్వర రావు మూవీ వివాదాల్లో చిక్కుకుంది. రిలీజ్ చేసిన టీజర్లో ఎరుకల సామాజిక వర్గానికి సంబందించిన జాతిని, తమ గ్రామాలని, యాసని, అవమానించేలా మూవీ తెరకెక్కించారని స్టువర్ట్ పురం గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మూవీతో లక్షల మంది ఆత్మగౌరవాన్ని, మనోభావాలను దెబ్బతీస్తున్నారని ప్రధాన డిమాండ్ గా తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్ దగ్గర వీరు నిరసన తెలుపగా..పలు సంఘాలు వీరికి మద్దతుగా నిలబతున్నాయి. దీంతో ఈ మూవీని తక్షణమే ఆపేయాలని, రిలీజ్కు పర్మిషన్ ఇవ్వొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. స్టువర్ట్ పురం ఏరియాను పూర్తిగా నేర పూరితమైనదిగా చూపించారంటూ..కొంత మంది సొంత లాభాల కోసం ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. .
ఇక రీసెంట్గా టీజర్ విషయంలో ఏపీ హైకోర్టు అభ్యంతరం తెలిపింది. వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఎరుకల సామాజిక వర్గాన్ని, అలాగే స్టువర్ట్ పురం ప్రాంత ప్రజలను డైలాగ్స్ విషయంలో అవమానించేలా ఉందంటూ..చుక్కా పాల్‌రాజ్ హైకోర్టులో పిల్ వేశారు. దీంతో పిటిషనర్ తరుపు అడ్వకేట్స్ వారి వాదనలు వినిపించారు. అడ్వకేట్స్ వాదనలు విన్న హై కోర్ట్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం టైగర్ నాగేశ్వర రావు మూవీ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్‌కు నోటీసులు కూడా జారీచేసింది.
ఇక 1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవడ్ బ్యూటీ నుపుర్ సనన్(Nupur Saonon) హీరోయిన్ గా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్(Abhishek Agarwal Arts Byanar) పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మురళీశర్మ, రేణు దేశాయ్, గాయత్రీ భార్గవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్(gvprakash) సంగీతం అందిస్తున్న ఈ సినిమా..అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.