ఈ సినిమా సగం హిట్టు కొట్టేసింది

ఈ సినిమా సగం హిట్టు కొట్టేసింది

రామ్ ఫస్ట్ టైమ్ పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సినిమా ‘ద వారియర్’. లింగుస్వామి దర్శకుడు. కృతీశెట్టి హీరోయిన్. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ జులై 14న వరల్డ్ వైడ్ గా విడుదలవుతోంది. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ రీసెంట్ గా అనంతపురంలో ట్రైలర్ ను లాంచ్ చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘సీమలో ఈవెంట్ చేసిన ఈ సినిమా సగం హిట్టు కొట్టేసింది. ఇక మిగిలింది థియేటర్స్ లోనే. వారియర్ హిట్ కన్ ఫార్మ్’ అన్నారు.

రామ్ మాట్లాడుతూ ‘నాకు అభిమానుల్ని చూస్తేనే ఎనర్జీ వస్తుంది. లింగుస్వామి మంచి మనసున్న మనిషి. సినిమాలో ప్రతి ఎమెషన్ ని జెన్యూన్ గా ఫీలై తీశారు. తెలుగులో చాలా కమర్షియల్ హిట్స్ లింగుస్వామి సినిమాల్లోని సీన్లు చూసి స్ఫూర్తి పొందినవే’ అన్నాడు.  ఎనర్జిటిక్ టీమ్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉందంది కృతీశెట్టి.

ఆది పినిశెట్టి మాట్లాడుతూ ‘ఈ సినిమాతో నాకు మంచి ఫ్రెండ్ (రామ్) దొరికాడు. తనతో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియెన్స్’ అని చెప్పాడు. ‘ఎప్పట్నుంచో చేయాలనుకుంటున్న  స్ట్రెయిట్ తెలుగు సినిమా రామ్ తో చేయడం ఆనందంగా ఉంది. తనలో చాలా ఎనర్జీ ఉంది. బెస్ట్ టీమ్ కుదిరింది. ప్రొడ్యూసర్స్ అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. ఈ నిర్మాతలతో మరో మూవీ చేస్తాను. ‘వారియర్2’ కూడా తీస్తాను’ అన్నారు లింగుస్వామి. నిర్మాత శ్రీనివాసా చిట్టూరితో పాటు  మిగతా టీమ్ అంతా పాల్గొన్నారు.