సెంట్రల్ స్కీమ్స్ ను సద్వినియోగం చేసుకోవాలి : తమిళిసై

సెంట్రల్ స్కీమ్స్ ను  సద్వినియోగం చేసుకోవాలి : తమిళిసై

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్​ను  క్షేత్ర స్థాయిలో ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ తమిళిసై సూచించారు. గురువారం  రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్ ఖాన్ పేట గ్రామపంచాయతీలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో  గవర్నర్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రజలకు చేరవేసేందుకు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ యాత్ర ఉపయోగ పడుతుందని తెలిపారు. పీఎం ఆవాస్ యోజన, అటల్ పెన్షన్ యోజన, ఎంజీఎన్ఆర్ఈజీఏ, వడ్డీ లేని రుణాలు, పీఎం ఉజ్వల, వ్యవసాయ సంబంధిత పథకాలపై ఈ ఆడియో విజువల్ వ్యాన్లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు. 

రాష్ర్టంలో  ఈ యాత్ర  వచ్చే నెల 26 వరకు కొనసాగనుందని గవర్నర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను తమిళిసై సందర్శించారు.  డ్రోన్ ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి, లీడ్ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.