పీలేకు కన్నీటి వీడ్కోలు

పీలేకు కన్నీటి వీడ్కోలు

శాంటోస్‌‌‌‌: బ్రెజిల్‌‌‌‌ సాకర్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ పీలేకు అభిమాన లోకం కన్నీటితో వీడ్కోలు పలికింది. క్యాన్సర్‌‌‌‌తో గత వారం మరణించిన పీలే అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి.  బ్రెజిల్  జాతీయ జెండా, శాంటోస్‌‌‌‌ క్లబ్‌‌‌‌ జెండా కప్పిన పీలే భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో  విలా బెల్మిరో స్టేడియం నుంచి అతను పుట్టి, పెరిగిన శాంటోస్‌‌‌‌ వీదుల గుండా ఊరేగించారు. 

కొన్ని  గంటల పాటు సాగిన అంతిమ యాత్రలో వేలాది మంది ఫ్యాన్స్‌‌‌‌ పాల్గొన్నారు. బ్రెజిల్ కొత్త ప్రెసిడెంట్‌‌‌‌ లుజియ్‌‌‌‌ ఇనాసియో పీలేకు నివాళి అర్పించారు. అనంతరం నెక్రోపోల్ ఎక్యుమెనికా మెమోరియల్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.