వీడియో​​ ఆన్‌లైన్‌లో పెడతానంటూ యువకుడిని బెదిరించిన యువతి

V6 Velugu Posted on Apr 10, 2021

  • డబ్బులు ఇవ్వకపోతే వీడియో​ను​ ఆన్‌లైన్‌లో పెడతా
  • యువకుడిని బెదిరించిన యువతి
  • పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

జీడిమెట్ల, వెలుగు: ఫేస్ బుక్ ద్వారా యువకుడికి పరిచయమైన ఓ యువతి వీడియో కాల్ మాట్లాడి..డబ్బులు ఇవ్వకుంటే ఆ కాల్ రికార్డును ఆన్ లైన్ లో పెడతానంటూ బెదిరించింది. దీంతో బాధితుడు జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించాడు. జీడిమెట్లకు చెందిన ఓ యువకుడి(20)కి ఈ నెల 7న మధ్యాహ్నం ఫేస్ బుక్ లో ‘ప్రియ ప్రియ’ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ  యువకుడు దాన్ని యాక్సెప్ట్ చేయగానే ఆ యువతి మెసేజ్ చేసింది. అతడు కూడా రిప్లయ్ ఇచ్చాడు. కొంతసేపు చాటింగ్ చేసిన తర్వాత ఆ యువతి వీడియో కాల్ చేద్దామని అడగడంతో అతడు ఒప్పుకున్నాడు. ఇద్దరూ న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత  న్యూడ్ వీడియోకాల్ ను రికార్డు చేశానని, 8874135043 నంబర్​కి రూ.11,999 గూగుల్ పే చేయమని అతడితో ఆ యువతి చెప్పింది. లేకపోతే ఆ వీడియోను ఫేస్ బుక్​లోని అతడి ఫ్రెండ్స్​కు పంపుతానని బెదిరించింది. ఆమె అడిగినంత డబ్బులు తన దగ్గర లేవని యువకుడు చెప్పడంతో ఆ యువతి వెంటనే కాల్ రికార్డును అతడి ఫ్రెండ్స్​కి పంపింది. ఆ వీడియో చూసిన అతడి ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పడంతో భయపడ్డ యువకుడు యువతి చెప్పిన నంబర్ కి రూ.వెయ్యి ట్రాన్స్ ఫర్ చేశాడు.  మరిన్ని డబ్బులు పంపాలని లేదంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ యువతి అతడిని మళ్లీ బెదిరించింది. దీంతో ఆ యువకుడు జీడిమెట్ల పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tagged Hyderabad, nude video, Blackmail

Latest Videos

Subscribe Now

More News