సబ్సిడీ లోన్లు ఈ ఏడాదీ లేనట్టే!

సబ్సిడీ లోన్లు ఈ ఏడాదీ లేనట్టే!
  • కనీసం యాక్షన్ ప్లాన్లు రూపొందించని కార్పొరేషన్లు
  • 2018 నుంచి రాష్ట్రంలో యువతకు లోన్లు బంద్
  • ఇప్పటికే 9 లక్షల లోన్ అప్లికేషన్లు పెండింగ్
  • నాలుగేండ్లుగా కార్పొరేషన్లకు తగ్గుతూ వస్తున్న బడ్జెట్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో యువతకు ఈ ఏడాది కూడా సబ్సిడీ లోన్లు వచ్చే పరిస్థితి కనిపిస్త లేదు. గతంలో కార్పొరేషన్లు యాక్షన్ ప్లాన్లు రూపొందించినా సర్కారు ఆమోదించకపోగా.. ఈ సారి కనీసం యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్లు కూడా రూపొందించలేదు. దీంతో ఈసారి కూడా సబ్సిడీ లోన్లు వచ్చుడు కష్టమే అన్నట్లుగా ఉంది. గత నాలుగేండ్ల నుంచి యువతకు లోన్లు రావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేషన్ల పరిధిలో దాదాపు 9 లక్షల లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్లికేషన్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి హడావుడిగా దరఖాస్తులు స్వీకరించిన సర్కారు.. తర్వాత వాటిని పక్కనపడేసింది.  

నిధులు లేక

నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి వైపు మళ్లించి ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎంబీసీ సహకార ఆర్థిక సంస్థలు(కోఆపరేటీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్లు) నిధులు లేక బలహీనపడుతున్నాయి. ఏటేటా వీటికి బడ్జెట్ కేటాయింపులను తగ్గిస్తున్న ప్రభుత్వం.. కనీసం కేటాయించిన మేరకు కూడా నిధులు విడుదల చేయడం లేదు. దీంతో ఆయా కార్పొరేషన్ల లక్ష్యం గాడి తప్పుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్కరికి కూడా లోను ఇవ్వలేదు. 

ఎంబీసీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్తగనే..

ఎంబీసీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద1420 మంది దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం అందరికీ రూ. 50 వేల చొప్పున రుణాలు ఇచ్చింది. మళ్లీ అప్పటి నుంచి లోన్లు ఇవ్వడం లేదు. గతంలో ఎప్పుడో దరఖాస్తు చేసుకున్న15 మందికి మంత్రి గంగుల కమలాకర్​ఇటీవల ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆటోలను పంపిణీ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంబీసీలకు ఏటా వెయ్యి కోట్లు కేటాయిస్తామని స్వయంగా సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించినా.. ఆచరణలోకి రాలేదు. మొత్తంగా ఎంబీసీలకు రూ. మూడు వేల కోట్లు కేటాయిస్తే.. కేవలం 7.10 కోట్లు మాత్రం ఖర్చు పెట్టడం గమనార్హం.

ఎస్సీల అప్లికేషన్లు పక్కన పడేసిన్రు..

ఎస్సీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్సిడీ లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్లికేషన్లను అధికారులు పక్కనపడేశారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను తీసుకుని ఏడాది దాటినా రుణాలు రావడం లేదు. 2020 డిసెంబర్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ.., 18,285 మంది యువతకు లోన్లు ఇవ్వాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిర్దేశించుకున్నారు. నిరుడు మే నెలలోనే అందరికీ ఇవ్వాలని అనుకున్నా.. ముందుకు పడలేదు. సుమారు2 లక్షల మంది నిరుద్యోగ యువత లోన్ల కోసం ఆశగా ఎదురుచూస్తోంది. 2018 ఎన్నికల తర్వాత కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోన్లు మొత్తానికే రావడం లేదు.

ఎస్టీలదీ అదే పరిస్థితి..

ఎస్టీలకు సబ్సిడీ లోన్ల కోసం 2020 నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గిరిజన సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నిరుద్యోగ యువత నుంచి అప్లికేషన్లు స్వీకరించి ఇప్పటికే ఏడాదిన్నర దాటింది. ఇప్పటి దాకా ఇంకా గిరిజన యువతకు లోన్లు ఇవ్వలేదు. లక్ష మంది ఎస్టీ యువత లోన్ల కోసం ఎదురుచూస్తోంది. కాగా 2018–-2019 ఆర్థిక సంవత్సరం అప్లికేషన్లు ఇంకా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పటి దాకా ఒక్కరికీ కూడా లోను ఇవ్వలేదు.

పెండింగ్​లో లక్షల దరఖాస్తులు

బీసీల స్వయం ఉపాధికి సంబంధించి బీసీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 12 ఫెడరేషన్లు ఉన్నాయి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి బీసీలకు రెండు సార్లు మాత్రమే లోన్లు వచ్చాయి. 2015లో ఒకసారి, 2018లో మరోసారి ఇచ్చారు. 2018లో దరఖాస్తు చేసుకున్నవారిలో లక్ష లోపు లోన్లు అవసరం ఉన్న 50 వేల మంది వరకు రుణాలు ఇచ్చారు. ఆ తర్వాత ఎలక్షన్లు అయిపోగానే అప్లికేషన్లు అలాగే ఉండిపోయాయి. ప్రస్తుతం 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే మూలుగుతున్నాయి.