థియేటర్లో విచిత్రం.. ధమ్కీ సినిమా బదులు ధమాకా సినిమా 

థియేటర్లో విచిత్రం.. ధమ్కీ సినిమా బదులు ధమాకా సినిమా 

విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన సినిమా ధమ్కీ.. ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి విశ్వక్ సేన్ దర్శకత్వం వహించాడు. అయితే, సినిమా విడుదల సందర్భంగా విశాఖపట్నంలో వింత ఘటన చోటు చేసుకుంది. వైజాగ్ సుకన్య థియేటర్లో విశ్వక్ సేన్ ధమ్కీ సినిమా బదులుగా.. రవితేజ ధమాకా సినిమాని ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధమాకా టైటిల్ స్క్రీన్ పై కనిపించగానే ప్రేక్షకులు హంగామా చేశారు. దాంతో తప్పు తెలుసుకున్న థియేటర్ యాజమాన్యం సినిమా నిలిపేసి.. మళ్లీ ధమ్కీ రిలీజ్ చేశారు. ధమ్కీ, ధమాకా సినిమా పేర్లు రెండూ ఒకేలా ఉండటంతో థియేటర్ యాజమాన్యం కాస్త కన్ఫ్యూజ్ అయినట్లు తెలుస్తోంది.