గౌరవెల్లి ప్రభుత్వ పాఠశాలలో చోరీ..మానిటర్లు, సీపీయూలు, మైక్రోస్కోప్  మాయం

గౌరవెల్లి ప్రభుత్వ పాఠశాలలో చోరీ..మానిటర్లు, సీపీయూలు, మైక్రోస్కోప్  మాయం

హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు: సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గ్రామంలోని జడ్పీ హైస్కూల్ లో దొంగలు పడి కంప్యూటర్  పరికరాలు, సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు.

3 మానిటర్లు, 2 సీపీయూలు, ఒక హార్డ్ డిస్క్, ఒక మైక్రోస్కోప్ తో పాటు నిఘా కోసం ఏర్పాటు చేసిన 2 సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి క్లూస్  టీమ్ ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. ఘటనా స్థలాన్ని హుస్నాబాద్  ఏసీపీ సదానందం పరిశీలించారు.

కాగా, ఇదే స్కూల్​లో గతంలోనూ చోరీ జరిగింది. హెచ్ఎం జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.