పని చేసిన ఇంట్లో చోరీ.. ఇద్దరు మహిళలు అరెస్ట్​

పని చేసిన ఇంట్లో చోరీ.. ఇద్దరు మహిళలు అరెస్ట్​
  • 47 తులాల బంగారం స్వాధీనం

మెహిదీపట్నం, వెలుగు : వృద్ధురాలి ఇంట్లో 47 తులాల బంగారు నగలను దోచుకుని పారిపోయిన నిందితులను అరెస్టు చేసిన ఘటన హూమాయన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  ఇన్ స్పెక్టర్ సైదేశ్వర్ తెలిపిన ప్రకా రం.. గత ఆదివారం ఉదయం విజయ నగర్ కాలనీ పరిధి పీఎస్ నగర్ కు చెందిన సత్య నారాయణ తన తల్లి గృహలక్ష్మి ఇంట్లోని బీరువాలోంచి 47 తులాల బంగారు నగలు దొంగలు ఎత్తుకెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేశారు.  ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ బాలకృష్ణ దర్యాప్తు చేపట్టారు.

సీసీ ఫుటేజ్ లతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. గతంలో పీఎస్ నగర్ ప్రాంతానికి చెందిన బల్గురి పుష్ప వృద్ధురాలి ఇంట్లో పని చేసి మానేసింది. ఇంట్లోని అన్ని విషయాలను ఆమె గమనించింది. దీనిని ఆసరాగా చేసుకుని ఆదివారం వృద్ధురాలు స్నానానికి వెళ్లగా తన సోదరి నందిపాటి సునీతతో కలిసి చోరీకి పాల్పడింది. పోలీసులు నిందితులను అరెస్టు చేసి 47 తులాల బంగారు నగలను సొత్తును స్వాధీనం చేసుకున్నారు.