మంచిర్యాల జిల్లాలో రెండు ప్రధాన ఆలయాల్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు. శనివారం ( డిసెంబర్ 6 ) అర్థరాత్రి హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలోని ఎల్లమ్మ, శ్రీ మార్కండేయ ఆలయాల్లో చోరీ జరిగింది. అర్థరాత్రి సమయంలో ఆలయాల్లోకి చొరబడ్డ దుండగులు అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఆదివార ఉదయం చోరీ జరిగిన విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చోరీపై ఆరా తీశారు. ఆలయంలో చోరీ జరగడం, ఏకంగా అమ్మవారి ఆభరణాలను ఎత్తుకెళ్ళడంతో గ్రామంలో చర్చనీయాంశం అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలిసులు. ఆలయాల్లో చోరీకి పాల్పడ్డ దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు గ్రామస్థులు
►ALSO READ | తల్లిని రోడ్డు మీద వదిలేసిన కొడుకులు
