దౌలాపూర్ లో రెండు గుళ్లలో చోరీ

దౌలాపూర్ లో రెండు గుళ్లలో చోరీ

జగదేవ్​పూర్ (కొమురవెల్లి), వెలుగు: జగదేవ్​పూర్ మండలంలోని దౌలాపూర్ గ్రామంలో పెద్దమ్మ, దుర్గమ్మ గుళ్లలో తాళాలు పగలగొట్టి అమ్మవార్ల ముక్కు పుడక, పుస్తెలతో పాటు గుడిలోని హుండీని దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. మంగళవారం గుర్తించిన ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి ఆలయాలను పరిశీలించారు. సీసీటీవీలో ఇద్దరు బైక్ పై వచ్చి చోరీ చేసినట్టుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.  

మందుబాబులకు జరిమానా, జైలు 

జగదేవపూర్ మండలంలో మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఇద్దరికి గజ్వేల్ మేజిస్ట్రేట్ స్వాతి ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానాతో పాటు మూడు రోజుల జైలు శిక్ష విధించారు. 

షటర్​ తాళం పగులగొట్టి రూ.15వేలు చోరీ

జోగిపేట: గుర్తు తెలియని వ్యక్తులు షటర్​ తాళం పగులగొట్టి కౌంటర్​లో నుంచి రూ.15వేలు చోరీ చేశారు. ఎస్ఐ పాండు కథనం ప్రకారం.. పట్టణంలోని భగత్​సింగ్​రోడ్డులోని చింతల రాజమల్లయ్య ఫర్టిలైజర్​ షాపులో మంగళవారం వేకువ జామున గుర్తు తెలియని వ్యక్తులు షటర్​ తాళం ధ్వంసం చేసి లోపలకు చొరబడి కౌంటర్​లో నుంచి రూ.15వేలు చోరీ చేసినట్లు చెప్పారు.

 అదే షాపు ముందు గల మొబైల్​షాపులో కూడా ఫోన్​లు దొంగిలించినట్లు వివరించారు. చింతల రాకేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.