కేబుల్ వైర్ బండిళ్లు చోరీ

కేబుల్ వైర్ బండిళ్లు చోరీ

ఘట్ కేసర్, వెలుగు : కేబుల్ గోడౌన్ లో లక్షల రూపాయల విలువైన కేబుల్ వైర్ బండిళ్లు చోరీ అయ్యాయి. ఘట్ కేసర్ అడిషనల్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు .. అవుషాపూర్ లోని ఓ కేబుల్ గోడౌన్ లోకి గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగలు ప్రవేశించారు.  

అందులోని రూ.7.5 లక్షల విలువైన కేబుల్ వైర్ బండిళ్లను ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం గోడౌన్ ఇన్ చార్జ్ నరేందర్ సింగ్ వాచ్ మెన్ తో పాటు సిబ్బందిని విచారించినా ఫలితం లేకపోవడంతో  పోలీసులకు కంప్లయింట్ చేయగా..కేసు నమోదు చేశారు.