RajaSaabTeaser: ‘రాజా సాబ్’ టీజర్ అప్డేట్.. థమనన్న గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు..!

RajaSaabTeaser: ‘రాజా సాబ్’ టీజర్ అప్డేట్.. థమనన్న గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు..!

ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ టీజర్ అప్డేట్ వచ్చేసింది. జూన్ 16న ఉదయం 10 గంటల 52 నిమిషాలకు ‘రాజా సాబ్’ టీజర్ విడుదల చేయనున్నట్లు ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే.. ‘ది రాజా సాబ్’ టీజర్ను హైదరాబాద్తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శించాలని మేకర్స్ భావిస్తున్నారు.

థమన్ సంగీతం అందిస్తున్న ‘ది రాజా సాబ్’ టీజర్ను థియేటర్లలో చూసే అవకాశం ఉందని తెలియడంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఆ థియేటర్ల లిస్ట్ రాగానే.. సెలబ్రేషన్స్కు ప్లాన్ చేసుకోవాలని చూస్తున్నారు. కౌంట్ డౌన్ పోస్టర్లు వేయొచ్చుగా అని పీపుల్ మీడియా ఫ్యాక్టరీని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే రాజా సాబ్ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్కు, పోస్టర్స్కు, గ్లింప్స్కు మంచి స్పందన వచ్చింది. డిసెంబర్ 5న ‘ది రాజా సాబ్’ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

హారర్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమాను మారుతి తెరకెక్కిస్తున్నాడు. అలా అని పూర్తి సీరియస్ గా సాగే కథేమీ కాదు. హీరోహీరోయిన్ రొమాన్స్, డ్యూయెట్లు, పాటలు, ఫైట్లతో పాటు మారుతి మార్క్ కామెడీని మేళవించి ‘ది రాజా సాబ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ‘కల్కి్ 2898 AD’ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమా ఇది. ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ నటించినప్పటికీ ఆ పాత్ర నిడివి చాలా తక్కువే. దీంతో.. ఫుల్ మీల్స్ లాంటి సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఆశగా చూస్తున్నారు. మారుతి ఆ ఆకలిని తీరుస్తాడో.. లేదో.. డిసెంబర్ 5న ‘ది రాజా సాబ్’ సినిమా రిజల్ట్ తేల్చనుంది.