కర్నాటకలో రాజకీయ చిచ్చురాజేసిన పాఠ్యపుస్తకాల వివాదం

కర్నాటకలో రాజకీయ చిచ్చురాజేసిన పాఠ్యపుస్తకాల వివాదం

బెంగళూరు : పాఠ్యపుస్తకాల్లో ఆర్ఎస్ఎస్ నేతల ప్రసంగాలను చేర్చడంపై కర్ణాటకలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య వివాదం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. విద్యను కాషాయీకరణం చేస్తున్నారంటూ కర్ణాటక అసెంబ్లీ భవనం ముందు విపక్ష నేత సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరనసకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కర్ణాటక 10వ తరగతి పుస్తకాల్లో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పాఠాన్ని తొలగించిన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ ప్రసంగాన్ని చేర్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో భగత్ సింగ్ పాఠాన్ని తొలగించడం లేదని కర్ణాటక ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే హెగ్డేవార్ ప్రసంగం మాత్రం ఉంటుందని పేర్కొంది. దీంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు నిరసన తెలియజేశారు.