
టాలీవుడ్ బ్యూటీ సమంత(Samantha) ఇప్పుడు ‘సిటాడెల్’(Citadel) సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఉంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడ్డ సమంత ఇప్పుడు ఫుల్ చార్జ్‌తో షూటింగ్లో పాల్గొంటోంది. తాజాగా తన సోషల్ మీడియాలో ఓ డైరెక్టర్ ఫొటో పోస్ట్ చేసి అతడిపై పొగడ్తల వర్షం కురిపించింది. ఈ ప్రపంచంలో తను అందరికన్నా మంచి వ్యక్తి అని తెలిపింది.
అందాల రాక్షసి హీరో, చిలసౌ సినిమా దర్శకుడు రాహుల్ రవీంద్రన్(Rahul Raveendran) తన బెస్ట్ ఫ్రెండ్ అని మరోసారి తెలిపింది. ‘మీకు తెలిసిన ఓ మంచి వ్యక్తిని తీసుకుని వంద సార్లు అతడిని మల్టీప్లై చేస్తే అది నా బెస్ట్ ఫ్రెండ్. రాహుల్.. నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ సామ్ రాహుల్ రవీంద్రన్ ఫొటోను పోస్ట్ చేసింది.
వీరిద్దరూ ఓ తమిళ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చారు. ఆనాటి నుంచి వీరి స్నేహం కొనసాగుతోంది. సమంత పాత్రలకు డబ్బింగ్ చెప్పే సింగర్ చిన్మయిని(Chinmayi) రాహుల్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.