
జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలీకి వంద రోజుల పనికల్పిస్తాం. ఉపాధి పనులు చేసే సమయంలో అవసరమైన కనీస అవసరాలను ఏర్పాటు చేస్తాం. పనిచేసేచోట కూలీలకు ఎండ నుంచి రక్షణ కోసం నీడ ఏర్పా టుతోపాటు ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచుతామంటూ జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు,ప్రజాప్రతినిధులు తరచూ చెప్పే మాటలు ఆచరణకునోచుకోవడం లేదు. మండుటెండల్లో పని చేస్తున్నవేలాది మంది కూలీలు వసతులు లేని కారణంగానిత్యం నానా ఇబ్బందులు పడుతున్నారు .
కూలీలుపనులు చేసే సమయంలో గడ్డపారలు తగిలి గాయపడ్డా వారికి కనీసం ప్రథమ చికిత్స చేయడానికి కూడాఅవసరమైన మందులు ఉండడం లేదు. కూలీలు గాయపడితే మాకేంటి అన్నట్లుగా ఉపాధి పథకం అధికారులు, సిబ్బంది తీరు మారింది. కామారెడ్డి జిల్లాలో22 మండలాలు ఉండగా ప్రస్తుతం 17 మండలాల్లోఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఉపాధిపనులలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది.అయితే కూలీలకు కనీస వసతులు కల్పించడంలోమాత్రం పూర్తిగా వెనుకంజలో ఉంది. ప్రస్తుతంజిల్లాలో ఎలాంటి వ్యవసాయ పనులు లేకపోవడంతోగ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన కూలీలు, వ్యవసాయ రైతులు, నిరుద్యోగులు, స్టూడెంట్లు ఉపాధిపనులకు ఉత్సాహంగా వెళుతున్నారు .
జిల్లావ్యా ప్తంగా 2,17,928 జాబ్ కార్డులున్నా యి. 5,18,000మంది కూలీలు ఉన్నారు . జిల్లావ్యాప్తంగా 1.04లక్షల మంది కూలీలు ప్రస్తుతం ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు . వీరంతా ఉదయం 6 నుం చి మధ్యాహ్నం 11 గంటల వరకు పనులు చేసి ఇండ్లకు పోతున్నారు . ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో కూలీలు ఎండతాకిడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు . సుమారు 5 గంటలపాటు పనులు చేస్తున్న కూలీలు కొద్దిసేపు సేద దీరుదామన్నా పనులు చేసేచోట అధికారులు టెంట్లను ఏర్పాటు చేయడం లేదు. దాంతో ఎండలోనే ఉండాల్సివస్తోంది. తాగు నీటి సౌకర్యం కల్పించకపోవడంతో కూలీలే ప్లాస్టి క్ డబ్బా లు, సీసాల్లో నీటిని తెచ్చుకుంటున్నారు . తెచ్చుకున్న నీరు సైతం వేడెక్కడంతో తాగలేకపోతున్నా మని వాపోతున్నారు .
రెండేళ్ల క్రితం ఇచ్చిన టెంట్లే.
.గ్రామీణాభివృద్ధి శాఖ తాగునీటి కోసం కూలీలకు రోజుకు రూ.5 చొప్పున అదనంగా అందజేస్తోంది.ప్రతి ఉపాధి కూలీ కచ్చితంగా ఐదు లీటర్ల నీటిని పనిప్రదేశానికి తీసుకువెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే పని ప్రదేశాలు దూరంగా ఉండటం, తట్ట,పార, గడ్డపారతోపాటు ఐదు లీటర్లనీటిని మోసుకెళ్లడం ఇబ్బందికరంగా ఉందని కూలీలు చెబుతున్నారు .అధికారులే పని ప్రదేశాల్లో తాగునీటి వసతి కల్పించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు నీడ కోసం టెంట్లు , పనులు చేసేసందర్భంగా ఎవరికైనా గాయాలు తగిలితే ప్రథమచికిత్స చేసేందుకు మెడికల్ కిట్లను గ్రామీణాభివృద్ధిశాఖ సరఫరా చేస్తోంది. 2017‒18లో వాటినిశ్రమ శక్తి సంఘాలకు సరఫరా చేయగా మళ్లీ ఇవ్వలేదు. మెదక్ జిల్లాలో 12 వేల పైచిలుకు శ్రమశక్తిసంఘాలు ఉండగా కూలీలు రెండేళ్ల కిందట సరఫరాచేసిన టెంట్లు , మెడికల్ కిట్ లనే వినియోగిస్తున్నారు .వరంగల్రూరల్ జిల్లా వ్యా ప్తంగా 16 మండలాలపరిధి లో 1, 47,762 జాబ్ కార్డులు ఉండగాఇందులో 3,14,350 మంది ఉపాధి కూలీలు నమోదయ్యారు . ఫీల్డ్ అసిస్టెంట్లు ఇచ్చిన కొలతల ప్రకారంగుం తలను తవ్విన తర్వాతే ఇంటికి వెళ్లాలని చెప్పడంతో ఎండల్లోనే పనులు చేయాల్సి వస్తోంది. అంతేకాకుండా ఎండలకు నేల గట్టిగా ఉండడంతో పనిత్వరగా పూర్తి కావడం లేదు. కూలీలకు నీడ సౌకర్యంకల్పిం చడానికి ప్రభుత్వం రెండేళ్ల క్రితం టెంట్లనుఅందజేసిం ది. కానీ ఇవి ప్రస్తుతం ఎక్కడా కన్పించడంలేదు. మెట్లు పనికి వచ్చే సమయంలో టెంట్లను వెంటతేవడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు పేర్కొం టున్నారు .
దెబ్బలు తగిలితే…
ఉపాధి పనులు చేసేటప్పుడు గడ్డపా రలు తగిలి, మట్టి పెల్లలు మీదపడి చేతులు విరిగినా, కాళ్లకుగాయాలైన పట్టించుకునేవారే కరువయ్యారని, పనులు చేసేచోట కనీసం ప్రథమ చికిత్స కిట్లనుకూడా అందుబాటులో ఉంచడం లేదని ఉపాధి కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. లింగంపేటమండలంలోని నల్లమడుగు గ్రామానికి చెందిన మెట్టు సత్యవ్వ ఇటీవల పనులు చేస్తు న్నసమయంలో కిందపడి చేయి విరిగింది. బైండ్ల శివరాజవ్వ అనే కూలీ గాయపడింది. అయినా ఉపాధిసిబ్బంది ఎలాంటి ప్రథమ చికిత్స కిట్లను పనులు చేసేచోట ఉంచడం లేదని వారు ఆవేదన వ్యక్తంజేస్తున్నారు