ఉద్యోగాల భర్తీ ఎలాగూ లేదు.. ఔట్​సోర్సింగ్​ జాబ్స్​కూ ఎసరు?

ఉద్యోగాల భర్తీ ఎలాగూ లేదు.. ఔట్​సోర్సింగ్​ జాబ్స్​కూ ఎసరు?
  • కొత్తగా ఎవరినీ తీసుకోవద్దని ఆయా డిపార్ట్​మెంట్లకు సర్కారు ఆదేశం!
  • ఎమర్జెన్సీ అయితే సీఎం ఆమోదానికి పంపాలని సూచన
  • రాష్ట్రంలో ఏయే శాఖల్లో ఎంత మంది ఉన్నారనే వివరాలపై ఆరా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను రిక్రూట్​చేయాల్సిన ప్రభుత్వం.. వాటికి నోటిఫికేషన్లు ఇవ్వకపోగా.. ఇప్పుడున్న ఔట్​సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలను కూడా తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతినెలా జీతాల సమస్య వస్తోందనే కారణాలతో పోస్టులు కుదించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి ఔట్​సోర్సింగ్​పోస్ట్​క్రియేట్​చేయొద్దని అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ఏదైనా అత్యవసరమైతే సీఎం ఆమోదానికి పంపాల్సిందేనని స్పష్టం చేసింది. అదే టైంలో ఇప్పుడున్న ఔట్​సోర్సింగ్​ఉద్యోగాలను మరింత కుదించేందుకు ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏ డిపార్ట్​మెంట్​లో ఎంతమంది ఔట్​సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు ? అక్కడ అవసరాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారనే దానిపై వివరాలు తీస్తున్నారు. జీతాల సమస్యలపై ఇప్పటికే కొన్ని డిపార్ట్​మెంట్లలో ఔట్ సోర్సింగ్​ఉద్యోగులను తీసేశారు. ఇప్పుడు ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయనే దానిపై ఆరా తీస్తుండటంతో ఆ ఎంప్లాయీస్​ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రిక్రూట్​మెంట్ పై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఫైనాన్స్​డిపార్ట్​మెంట్ ఆఫీసర్లు చెప్తున్నారు.

ఇప్పటికే 20 వేల మంది తీసేసిన్రు
రాష్ట్రంలో కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్ కింద 1.70 లక్షల మంది పనిచేస్తున్నట్లు ఇటీవల ఫైనాన్స్, జీఏడీ డిపార్ట్​మెంట్లు లెక్కలు తీశాయి. ఇప్పుడు ఇందులో ఏ డిపార్ట్​మెంట్, ప్రభుత్వ సంస్థల్లో ఎంత మంది పనిచేస్తున్నరు ? అక్కడ అవసరాలు ఏంటి అనే వివరాలు తీస్తున్నారు. ఈ ఆరేండ్లలో దాదాపు 20 వేల మంది ఉద్యోగాలను ప్రభుత్వం తీసేసింది. నిరుడు లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత  ఆర్థిక లోటు పేరుతో వేల సంఖ్యలో ఔట్ సోర్సింగ్ ​ఎంప్లాయీస్​ను తొలగించారు. గతంలో ఉపాధి హామీ, భగీరథ, హార్టికర్టిల్చర్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్లలో సుమారు 10 వేల మందిని ఉద్యోగాల్లోంచి తీసేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో మరో10 వేల మందిని ఈ ఏడాదిలోనే తీసేశారు. ఇప్పుడు మరో 20 వేల మందిని తీసేసే ప్లాన్​ చేస్తున్నట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఖాళీల్లో చూపరు.. ఉన్నవారిని తీసేస్తరు
ఔట్​సోర్సింగ్, కాంట్రాక్ట్​ఎంప్లాయీస్​ విషయంలో సర్కారు ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. రాష్ట్రంలో 1.70 లక్షల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్​ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఈ పోస్టులను ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల లెక్కలో చూపడం లేదు. మొత్తం ఖాళీలు 60 నుంచి 70 వేలే ఉన్నట్లు చూపెడుతున్నరు. ఎప్పటికప్పుడు అవసరాలు తీరగానే ఔట్​సోర్సింగ్​ఉద్యోగులను తొలగించడమే తప్ప.. వారిని పర్మినెంట్​చేయడం గానీ, రెగ్యులర్​ పోస్టులు రిక్రూట్​చేయడం గానీ జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి.