ధోనిని పక్కన పెట్టే ప్రసక్తే లేదు!

ధోనిని పక్కన పెట్టే ప్రసక్తే లేదు!

ముం బై: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీని సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ కు ఎంపిక చేయకపోవడంపై తీవ్ర దుమారమే రేగింది. బోర్డు కావాలనే ధోనీని సైడు  చేసిందని విమర్శలు వచ్చాయి . అయితే ధోనీని పక్కనపెట్టలేదని, 2020 టీ20 వరల్డ్‌‌కప్‌ కు తగిన జట్టు రెడీ  చేసుకునేందుకు మహీనే సెలెక్షన్‌ కమిటీకి గడువిచ్చాడని ఓ సెలెక్టర్‌ చెప్పారు. జట్టు బలంగా ఉండడంతోపాటు వికెట్‌ కీపర్ల బెంచ్‌ బలం విషయంలో సెలెక్టర్లు ధీమాగా ఉన్నప్పుడే ధోనీ రిటైర్మెంట్‌ పై ఓ నిర్ణయం తీసుకుంటాడని తెలిపారు.‘ ధోనీని విస్మరించే ప్రసక్తే లేదు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌‌కప్‌ ఉండడంతో అతనే మాకు టైం ఇచ్చాడు. రిషబ్‌ పంత్‌ గాయపడితే టీ20ల్లో తగిన ప్రత్యా మ్నాయం లేదన్న విషయం ధోనీకి
కూడా తెలుసు. వెస్టిండీస్‌ టూర్‌ కు ముందు మహీ రెండు నెలల సెలవు పెట్టాడు. సెలెక్టర్లం దరికీ లెక్కలు బాగా వచ్చు. ఆ సెలవు ఇంకా పూర్తి కాలేదు’ అని ఆ సెలెక్టర్‌ అన్నారు. వన్డే వరల్డ్‌‌కప్‌ తర్వాత ధోనీతో తాము ఇప్పటిదాకా మాట్లా డలేదని, అతని ప్లాన్స్‌ ఏంటో తమకు తెలియదన్నా రు. గాయం వల్ల కానీ, మరేదైనా కారణం వల్ల కానీ పంత్‌ టీ20 జట్టుకు దూరమైతే, అప్పుడు ధోనీ కూడా లేకపోతే టీమ్‌ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని ఆ సెలెక్టర్‌ తెలిపారు. ధోనీ బ్యా ట్‌ పవర్‌ తగ్గిందనేది అభిమానులు అభిప్రాయమేనని, కానీ మహీ సత్తా ఏంటో మేనేజ్‌ మెంట్‌ కు తెలుసన్నారు. ఫినిషర్‌ రోల్‌‌లో ధోనీకి ప్రత్యామ్నాయం ఇప్పటికీ లేదన్నాడు. ఇప్పటికైతే పంత్‌ గాయపడితే టీ20ల్లో టీమిండియాకు రిప్లేస్‌ మెంట్‌
లేదనేది సత్యమని ఆ సెలెక్టర్‌ తెలిపారు.