అహంభావ పూరిత కామెంట్లతో ప్రయోజనం లేదు

అహంభావ పూరిత కామెంట్లతో ప్రయోజనం లేదు

హైదరాబాద్,వెలుగు: విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే బండి సంజయ్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు పోటీ చేసే దమ్ముందా.? అని బండి సంజయ్ చేసిన కామెంట్లను చాడ వెంకట రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించారు. అహంభావ పూరిత కామెంట్లతో ప్రయోజనం లేదన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజీనామా చేస్తేనే.. మునుగోడుకు ఉపఎన్నిక అనివార్యమైందని తెలిపారు. బీజేపీ దేశాన్ని మతోన్మాదంతో విభజిస్తోందని.. ఆర్థిక వ్యవస్థ కుంటుపడేలా చేసి  ప్రజలను ఇబ్బందులు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలను లెక్కచేయకుండా 4 వేల మంది కమ్యూనిస్టులు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారని.. అలాంటి పార్టీలను బీజేపీ సవాలు చేయడం సూర్యుని మీద ఉమ్మి వేయడం లాంటిదని పేర్కొన్నారు.