శేరిలింగంపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

శేరిలింగంపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

రంగారెడ్డి: శేరిలింగంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలపై బీఆర్ ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ అనుచరులు దాడులు చేశారు.. దాడి చేసిన వారిని వదిలిపెట్టి తమ కార్యకర్తలను అరెస్ట్ చేశారని మియాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్, టీడీపీ వర్గీయులు ఆందోళన దిగారు. తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేశారని నిరసన వ్యక్తం చేశారు.

బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి అరికె పూడి గాంధీ అనుచరులు తండాకు కార్యకర్తపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని తండా వాసులు మియాపూర్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అకారణంగా కార్యకర్తలపై చేయిచేసుకోవడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్, టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో మియాపూర్ పీఎస్ కు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.