స్విమ్మింగ్ పూల్స్ వద్ద ట్రైనర్ ఉండాలి

స్విమ్మింగ్ పూల్స్ వద్ద ట్రైనర్ ఉండాలి
  • ఇల్లీగల్ స్విమ్మింగ్ పూల్స్పై నిఘా పెట్టాలి
  • బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్: నాగోల్ స్విమ్మింగ్ పూల్ నిందుతులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రతి  స్విమ్మింగ్ పూల్స్ దగ్గర ఒక  ట్రైనర్ కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇల్లీగల్ గా నడిపిస్తున్న స్విమ్మింగ్ పూల్స్ పై ప్రభుత్వం నిఘా పెట్టాలన్నారు. నాగోల్ లో స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయిన మనోజ్ మృతిపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా స్విమ్మింగ్ పూల్స్ నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. మృతుడు మనోజ్ కుటుంబానికి 50లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  

 

 

 

 

ఇవి కూడా చదవండి

యాదాద్రి ఆలయం హుండీ లెక్కింపు..7రోజుల ఆదాయం ఎంతంటే

నీళ్ల కోసం ఢిల్లీ వాసుల గోస.. క్యాన్‌‌లకు తాళాలు

ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే