శ్రీశైలం వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్

శ్రీశైలం వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్

శ్రీశైలం వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దోమలపెంట టోల్ గేట్ నుంచి శ్రీశైలం డ్యామ్ వరకు దాదాపు ఐదు కిలో మీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. శ్రీశైలం సమీపంలోని ముఖద్వారం నుంచి ట్రాఫిక్ జామ్ కన్పిస్తోంది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముఖద్వారం నుంచి శ్రీశైలం టోల్ గేట్ వరకు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. 

వరుస సెలవులు రావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు సంఖ్య కూడా భారీగా పెరగడంతో దోమల పెంట టోల్ గేట్ నుంచి  శ్రీశైలం డ్యాం, ముఖద్వారం, హటకేశ్వరం, సాక్షి గణపతి ఆలయం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు గంటపాటు సాక్షిగణపతి ఆలయం సమీపంలో రోడ్లపై వాహనాలు ఆగడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు.