డిప్రెషన్ తో మెడికో సూసైడ్

డిప్రెషన్ తో మెడికో సూసైడ్

డిప్రెషన్ తో మెడికో సూసైడ్

మూసాపేట, వెలుగు :  డిప్రెషన్ తో ఓ మెడికో సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన ప్రకారం..  జనగామ జిల్లా దేవరుప్పులకు చెందిన కరుణ కొడుకు దీక్షిత్ రెడ్డితో కలిసి జగద్గిరిగుట్టలోని పాపిరెడ్డినగర్​లో నివసిస్తుంది. దీక్షిత్​(21) గాంధీ మెడికల్ కాలేజీలో మెడిసిన్​ సెకండ్ ఇయర్ స్టూడెంట్. మానసికంగా డిప్రెషన్‌‌లోకి వెళ్లిన దీక్షిత్ మందులు వాడుతుండగా.. ఆరోగ్యం బాగైందని రెండు నెలలుగా మానేశాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్లేడుతో ఎడమ కాలి తొడపై కోసుకుని అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు.