ఫోన్ ట్యాపింగ్ పై ఎలాంటి రివ్యూ చేయలేదు.. మీడియాతో సీఎం రేవంత్ చిట్ చిట్

ఫోన్ ట్యాపింగ్ పై ఎలాంటి రివ్యూ చేయలేదు.. మీడియాతో సీఎం రేవంత్ చిట్ చిట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కేసుపై ఇంకా ఎలాంటి రివ్యూ చేయలేదన్నారు. ఇటు మేడిగడ్డపై జ్యుడిషీయల్ విచారణ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.  కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు చర్చించేది ఉందని చెప్పారు. కాళేశ్వరం కరెంటు బిల్లులు అన్ని సముద్రం లో వదిలిన నీళ్లల్లాంటివని విమర్శించారు. 

52 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు అయ్యాయని చెప్పారు.తెలంగాణ లో ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అంటేనే త్యాగాలు, పోరాటాలు గుర్తుకొస్తాయన్నారు. అవే గుర్తుకొచ్చేలా రాష్ట్ర చిహ్నం, గేయం రూపొందిస్తున్నామని చెప్పారు. 

తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని రచయిత అందెశ్రీకి అప్పగించామన్నారు సీఎం. కిరవాణి వ్యవహారంలో తనకు సంబంధం లేదన్న రేవంత్...ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందేశ్రీదే ఫైనల్ డెసిషనన్నారు. 

తెలంగాణ ఆత్మ, ఉద్యమ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా రాష్ట్ర అధికారిక చిహ్నం తయారవుతోందన్నారు రేవంత్ రెడ్డి. అధికారిక చిహ్నంపై చిత్రకారులు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆయన నివాసంలో చర్చించారు. ఈ సందర్భంగా పలు నమూనాలను ఆయన పరిశీలించారు. తుది నమూనా ఎలా రావాలన్న అంశంపై సూచనలు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి చిహ్నం ఫైనల్​ చేసి రిలీజ్​ చేసేలా ప్రభుత్వం ప్లాన్​ చేస్తోంది.