హైదరాబాద్ ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. గుండె చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన మహిళ మృతి చెందింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం బానాల గ్రామానికి చెందిన అలివేలు అనే మహిళకు గుండె సమస్య రావడంతో ఆరోగ్య శ్రీ కింద ఆగస్టు 9న ఆస్పత్రిలో జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు. ఆరోగ్య శ్రీ మంజూరయ్యిందని చెప్పి చికిత్స ప్రారంభించారు. ఆరోగ్యం విషమంగా మారడంతో ఆగస్టు 17న సాయంత్రం మహిళ మృతి చెందింది.
అయితే లక్ష రూపాయలు కట్టేంత వరకు మృతదేహాన్ని ఇవ్వబోమని ఆస్పత్రి యాజమాన్యం చెప్పడంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది.

