
పద్మారావునగర్, వెలుగు: సర్జరీ చేసేందుకు గాంధీలోని ఓ డాక్టర్ పేషెంట్నుంచి డబ్బు డిమాండ్చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు నిగ్గు తేల్చేందుకు నలుగురు హెచ్ఓడీలతో స్పెషల్కమిటీని నియమించారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా మధిర కు చెందిన వెంకట్రెడ్డి అనారోగ్య సమస్యతో గాంధీలో చేరాడు. సర్జరీ చేయడానికి ఆర్దోపెడిక్ డిపార్ట్ మెంట్ కు చెందిన వైద్యాధికారి రూ.10 వేలు డిమాండ్చేశాడని, విధిలేక సదరు వ్యక్తి గూగుల్ పే ద్వారా ఆ మొత్తం చెల్లించినట్లు పేషెంట్ భార్య గోవిందమ్మ సూపరింటెండెంట్ప్రొ.రాజారావుకు లెటర్రాశారు. దీంతో విచారణ కమిటీని నియమించారు.