
కరోనా నివారణకు పార్లమెంట్, సుప్రీంకోర్టు ప్రాంగణాల్లో చర్యలు చేపట్టారు. థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసి పరీక్షించిన తర్వాతనే లోపలికి వెళ్లనిస్తున్నారు. సోమవారం నుంచి ఎంపీలు, స్టాఫ్, జర్నలిస్టులను మాత్రమే పార్లమెంట్ లోకి అనుమతిస్తున్నారు. స్టాఫ్, జర్నలిస్టులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. సందర్శకులకు పాస్ లు ఆపేశారు. సుప్రీంకోర్టులోనూ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. లాయర్లు, జర్నలిస్టులు, కక్షిదారులను మాత్రమే కోర్టు రూమ్స్ లోకి అనుమతిస్తున్నారు.