ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా 'సింగపూర్'

ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా 'సింగపూర్'

ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా సింగపూర్ నిలిచింది . ఈ ఏడాదికి గాను గ్లోబల్ అనలిటిక్స్ సంస్థ లా అండ్ ఆర్డర్ ఇండెక్స్ - గాలప్ విడుదల చేసింది. ఈ జాబితాలో సింగపూర్‌ అత్యుత్తమ స్కోర్ సాధించగా... 96 పాయింట్లతో ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా నిలిచింది. వీటిలో తజికిస్థాన్‌, నార్వే, స్విట్జర్లాండ్‌, ఇండోనేషియా మొదటి ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. 120 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో భారత్‌ 80 పాయింట్లు సాధించి 60 వ ర్యాంకులో నిలిచింది. పాయింట్ల పరంగా శ్రీలంక, పాకిస్థాన్‌తో పోల్చుకుంటే స్వల్పతేడానే కనిపించింది. అయితే భారత్‌ కంటే యూకే దిగువన ఉండటం గమనార్హం. 

ఆఫ్గానిస్థాన్‌ అత్యంత అసురక్షిత దేశంగా నిలిచింది. 51 పాయింట్లు సాధించి జాబితాలో చిట్టచివరి స్థానానికి పడిపోయింది. అఫ్గాన్ తర్వాత కింది నుంచి ఐదు స్థానాల్లో గాబన్‌, వెనిజువెలా, డెమొక్రాటిక్ రిపబ్లిక్‌ ఆఫ్ కాంగో, సియెర్రా లియోన్‌ నిలిచాయి.  ప్రజలు ఎంత సురక్షితంగా ఉన్నామని భావిస్తున్నారు..? గత ఏడాది దాడులు, దోపిడీల తీవ్రత ఎంత..? అనే ప్రాతిపదికన ఈ నివేదికను రూపొందించట్టు సమాచారం.