మనం మర్చిపోతున్న ఈ చిన్న చిన్న పాత ఆహార అలవాట్లు ఇవే.. ఎందుకంటే ?

 మనం మర్చిపోతున్న ఈ చిన్న చిన్న పాత ఆహార అలవాట్లు ఇవే.. ఎందుకంటే ?

"మనం ఎం తింటామో అదే మనం" అని మనం పుస్తకాలలో లేదా ఆరోగ్యకరమైన ప్రదేశాల్లో చదువుతాము, చూస్తుంటాము, వింటాము కూడా.  అయితే తినే ఆహారం గురించి ఈ నియమాలను పురాతన కాలం నుండి పాటిస్తున్నాము. ఆయుర్వేదం కూడా ఆహార పదార్థాల స్వభావం, అవి తినవలసిన సీజన్ ఆధారంగా కొన్ని రూల్స్ సూచించింది. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రముఖ పోషకాహార నిపుణులు కూడా ప్రజలు ఎక్కువగా  మర్చిపోయే కొన్ని పురాతన ఆహార నియమాలను ప్రస్తావించారు. మీ జీర్ణ ప్రక్రియను బలంగా, ఆరోగ్యంగా ట్రాక్‌లో ఉంచడానికి ఆయుర్వేదంలో శక్తివంతమైన మార్గదర్శకాలు ఉన్నాయి. 

ఆయుర్వేదం ప్రకారం, మన జీర్ణశక్తిని పెంచుకోవడానికి ఇంకా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ నియమాలు చాలా ముఖ్యమైనవి.  అయితే మనం పాటించాల్సిన 5 పురాతన ఆహార నియమాలు ఇవే.... 

ALSO READ : రాగి ముద్దలో బొద్దింక..

1. పప్పులను నానబెట్టే నియమం (Dal Rule): పప్పులు వండడానికి ముందు వాటిని తప్పకుండా నానబెట్టాలి. ఇది పప్పుల్లో ఉండే  యాంటీ-న్యూట్రియెంట్స్  తొలగిస్తుంది. గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది.

2. మసాలా దినుసుల నియమం (Spice Rule): మసాలాలను (Spices) అన్ని కలిపి మొత్తంగా కొని, వేయించి ఆ తర్వాత పొడి చేసుకోవాలి. రెడీమేడ్ పొడులను వాడకూడదు. ఎందుకంటే వేయించిన మసాలాలు వాటి శక్తిని, సువాసనను కాపాడుతాయి. 

3. సూప్(Soup) నియమం: సూప్‌లను ఎప్పుడూ వేడిగానే తాగాలి, చల్లగా తాగకూడదు. అలాగే సూప్‌లలో పండ్లను (ఆపిల్, పైనాపిల్ వంటివి) కలపకూడదు. పండ్లను సూప్‌లలో కలిపితే  కడుపు ఉబ్బరానికి కారణమవుతుంది.

4. పాల నియమం: పాలు తాగే ముందు వాటిని తప్పకుండా వేడి చేయాలి. పచ్చి పాలు తాగకూడదు. ఆయుర్వేదంలో పచ్చి పాలు జీర్ణం కాదని సూచిస్తుంది.

5. పండ్ల నియమం: పండ్లు తినేటప్పుడు విడిగా తినాలి అంటే భోజనం లేదా ఏదైనా ఆహారంతో పాటు తినకూడదు. ఆలా తింటే  జీర్ణంకాక  అసిడిటీకి దారితీయవచ్చు.