బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించే మంచి ఫ్రూట్స్ ఇవే..

బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించే మంచి ఫ్రూట్స్ ఇవే..

శరీరంలో హార్మోన్లు, విటమిన్లు, కొత్త కణాలు తయారీకి హెచ్.డి.ఎల్ (హై డెన్సిటీ లిపో ప్రొటీన్) కొలెస్ట్రాల్ అవసరం. అయితే, ఇదే కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండె సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దీన్నే ఎల్.డి.ఎల్ (లోడెన్సిటీ లిపోప్రొటీన్) కొలెస్ట్రాల్ అంటారు. అయితే, ఎల్. డి.ఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఎక్సర్సైజ్లు చేయడంతో పాటు కొన్నిరకాల పండ్లు తినాలని చెస్తోంది డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ డెల్నాజ్ చందువాడియా. వీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి.

• సోడియం, శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అది తగ్గించడానికి ఫైబర్ ఎక్కువ ఉండే పండ్లు తినాలి. ఫైబర్ లో ఉండే పెక్టిన్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఇది యాపిల్, పియర్స్ పండ్లలో ఎక్కువగా ఉంటుంది. ఇవి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
• అన్నిరకాల బెర్రీల్లో ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె సమస్యలు రాకుండా కాపాడతాయి.
• అరటిపండులో ఉండే ఫైబర్, విటమిన్స్, మినరల్స్, సుక్రోస్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, పొటాషియం, మెగ్నీషియం కొలెస్ట్రాల్ని ఫుడ్ తగ్గిస్తాయి. బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్లో ఉంచుతాయి.
• సిట్రస్ పండ్లలో విటమిన్ సితో పాటు ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించి, హెచ్.డి.ఎల్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి. బీపీ, గుండె సమస్యలు ఉన్నవాళ్లు ఈ పండ్లు తినడం మంచిది.
• అవకాడోలో ఉండే మోనోశాచ్యురేటెడ్, పాలీ అన్ శాచ్యురేటెడ్ కొవ్వులు కొలెస్ట్రాల్ ని బ్యాలెన్స్డ్ గా ఉంచుతాయి.