తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సమరం మొదలైంది. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తూ.. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2026, జనవరి 28వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది.
ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు ఇవే :
1. కరీంనగర్ కార్పొరేషన్ : మొత్తం వార్డులు 66
2. పెద్దపల్లి కార్పొరేషన్ : మొత్తం వార్డులు 60
3. నిజామాబాద్ కార్పొరేషన్ : మొత్తం వార్డులు 60
4. మహబూబ్ నగర్ కార్పొరేషన్ : మొత్తం వార్డులు 60
5. మంచిర్యాల కార్పొరేషన్ : మొత్తం వార్డులు 60
6. భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్ : మొత్తం వార్డులు 60
7. నల్గొండ కార్పొరేషన్ : మొత్తం వార్డులు 48
ఏడు కార్పొరేషన్లలో 414 వార్డులు ఉన్నాయి. వీటికి ఫిబ్రవరి 11వ తేదీ ఓటింగ్ జరగనుంది. 13వ తేదీన కౌంటింగ్ నిర్వహించి.. ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు అధికారులు.
