ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ఏడాది స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలను గురువారం ప్రకటించింది. ముంబైలో జరిగిన ఈవెంట్‌లో పలు హిందీ ప్రాజెక్ట్స్‌తో పాటు సౌత్‌లోనూ కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేశారు. హిందీలో కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘ది ట్రైటర్స్’.. తేజ సజ్జా హోస్ట్‌గా తెలుగులోకి రాబోతోంది.
కిరణ్ అబ్బవరం, తిరువీర్ హీరోలుగా రాయలసీమ నేపథ్యంలో ‘గువ్వల చెరువు ఘాట్’ పేరుతో ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ భరత్ కమ్మ ఈ సిరీస్‌కు దర్శకుడు. సంయుక్త, తేజస్వీ రావ్ హీరోయిన్స్. బాపినీడు బి, సుధీర్ ఈదర నిర్మిస్తున్నారు.
అలాగే సముద్రఖని, ఐశ్వర్య రాజేష్, నరేష్ అగస్త్య లీడ్ రోల్స్‌లో గ్యారీ బీహెచ్ డైరెక్షన్‌లో ‘ఇసకపట్నం’ అనే సిరీస్ వస్తోంది. తమడా మీడియా నిర్మిస్తోంది. సుధీర్ బాబు, జేడీ చక్రవర్తి, హన్సిక, శ్రద్ధా శ్రీనాథ్ లీడ్స్ రోల్స్‌లో హైదరాబాద్ ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రవీణ్ సత్తారు ప్రైమ్ వీడియో కోసం ‘గల్లీ’ అనే సిరీస్ తీస్తున్నారు.
‘బాహుబలి’ నిర్మాతల నుంచి ఈ సిరీస్ వస్తోంది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల లీడ్ రోల్స్‌లో చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ‘జగమే సంగీతం’ సిరీస్ కూడా త్వరలో ప్రైమ్ వీడియోలోకి రానుంది. అలాగే దుల్కర్ సల్మాన్, పూజాహెగ్డే జంటగా రూపొందుతున్న చిత్రం, అడివి శేష్ ‘‘జీ 2’ కూడా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక తమిళం నుంచి నవీన్ చంద్ర హీరోగా వచ్చిన ‘ఇన్‌స్పెక్టర్ రిషి’కి సీక్వెల్, అబ్బాస్ రీ ఎంట్రీ ఇస్తున్న ‘ఎగ్జామ్’ సిరీస్, శశి కుమార్ లీడ్ రోల్‌లో ‘వధంధీ’ సీక్వెల్‌లు రాబోతున్నాయని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ప్రకటించింది.
