నగరంలో వరదల్లో గల్లంతై చనిపోయింది వీళ్లే..

నగరంలో వరదల్లో గల్లంతై చనిపోయింది వీళ్లే..

గ్రేటర్‌‌లో 31 మంది మృతి

వరదలో కొట్టుకుపోయి 25 మంది.. కరెంట్‌ షాక్ తో ఆరుగురు

గురువారం ఏడు డెడ్​బాడీలు లభ్యం

గల్లంతై ఆచూకీ తెలియని వారు మరో ఏడుగురు

హైదరాబాద్‌‌, వెలుగు: జీహెచ్‌‌ఎంసీ పరిధిలో గల్లంతైన, వరదల్లో కొట్టుకుపోయిన వారి సంఖ్య రోజురోకు పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం నుంచి గల్లంతైన వారి మృతదేహాలు ఒక్కొక్కటిగా దొరుకుతున్నాయి. గురువారం రాత్రి వరకు సిటీలో మొత్తం 32 మంది మృతి చెందారు. 25 మంది వరదల్లో కొట్టుకుపోయి చనిపోగా.. ఆరుగురు సెల్లార్లలో నీటీని తోడుతూ కరెంట్ షాకు కొట్టి ప్రాణాలు విడిచారు. అలాగే గల్లంతై న మరో ఆరుగురి ఆచూకీ తెలియడం లేదు. వీరి కోసం పోలీసులు, ఎన్‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌ టీమ్స్‌‌ వెతుకుతున్నాయి.

గురువారం ఏడు డెడ్‌‌బాడీలు లభ్యం

వరద నీటిలో గల్లంతైన వారిలో గురువారం ఒక్కరోజే ఏడుగురి డెడ్‌‌బాడీలు దొరికాయి. మంగళవారం లష్కర్‌‌‌‌గూడ వాగులో కొట్టుకుపోయిన కారులో గల్లంతైన రాఘవేందర్‌‌‌‌ డెడ్‌‌బాడీని చెట్లపొదల్లో స్వాధీనం చేసుకున్నారు. తారమతిపేట్‌‌లో గుర్తు తెలియని మేల్‌‌ డెడ్‌‌బాడీని హయత్‌‌నగర్‌‌‌‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాల కోసం ఎంక్వైరీ చేస్తున్నారు. మంగళవారం వనస్థలిపురంలో నమోదైన మిస్సింగ్‌‌ కేసులో ఇద్దరు యువకుల డెడ్‌‌బాడీస్‌‌ లభ్యమయ్యాయి. తొర్రూర్​కు చెందిన యువకులు చాట్‌‌ తినేందుకు ఇంజాపూర్‌‌‌‌ వెళ్లి గల్లంతైనట్లు పోలీసులు గుర్తించారు.

గల్లంతైన, చనిపోయిన వారి వివరాలు

చాంద్రాయణగుట్ట: బండ్లగూడ గౌస్‌‌నగర్‌‌‌‌లో వెంచర్‌‌‌‌ గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి.

మైలార్‌‌‌‌దేవ్‌‌పల్లి: అలీనగర్‌‌‌‌లో ఒకే కుటుంబానికి చెందిన ఖుద్దుస్‌‌ ఖురేషి(66) అబ్దుల్‌‌ ఖురేషి(45), వాసే ఖురేషి(40), ఫర్హనా తబసుమ్(27) దరక్ష ఖురేషి(30), అమీన(8) హమేరా(6) వాహేద్‌‌ ఖురేషి(5) గల్లంతు.  ఫర్హనా తబసుమ్, దరక్ష ఖురేషి డెడ్‌‌బాడీలు లభ్యం.

గగన్‌‌పహాడ్‌‌: అప్పా చెరువు కట్టతెగి వరద నీటిలో ఒకే కుటుంబానికి చెందిన అమీర్‌‌‌‌ఖాన్‌‌, కరీమా బేగం, సాహిల్‌‌, ఆయన్‌‌ మంగళవారం మృతి. ఆయన్‌‌ ఆచూకీ లభించలేదు. మంగళవారం ఇండిగో ఎయిర్‌‌లైన్స్‌‌ఉద్యోగి ఎన్‌‌. మాధవ రావు(43) డెడ్‌‌బాడీ లభ్యం.

అబ్దుల్లాపూర్ మెట్‌‌: లష్కర్‌‌గూడలో గల్లంతైన వెంకటేశ్‌‌గౌడ్‌‌(48),రాఘవేందర్(35) డెడ్‌‌బాడీలు లభ్యం

పహాడీషరీఫ్‌‌: శంషాబాద్‌‌ ఫ్యాబ్‌‌సిటీ వద్ద జలమండలి స్వీపర్‌‌ ‌‌వరలక్ష్మీ(32) గల్లంతు బుధవారం డెడ్‌‌బాడీ లభ్యం.

ఫలక్‌‌నుమా: రైల్వే ట్రాక్‌‌ వద్ద ముగ్గురు గల్లంతు, మృతి.

హయత్‌‌నగర్‌‌‌‌: తారమతి పేట్‌‌ గౌరెల్లి బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని డెడ్‌‌బాడీ గుర్తింపు. తొర్రూర్‌‌‌‌కు చెందిన ప్రణయ్(19), ప్రదీప్‌‌(16) ఇంజాపూర్‌‌ ‌‌వాగులో గల్లంతై మృతి.

ఎల్బీనగర్‌‌‌‌: నాగోల్‌‌ బండ్లగూడలో కొట్టుకుపోయిన పోస్ట్​మాస్టర్‌‌‌‌ సుందర్‌‌‌‌రాజు(55). గురువారం నాగోల్‌‌ చెరువులో డెడ్‌‌బాడీ లభ్యం.

సైదాబాద్‌‌: సింగరేణి కాలనీ కుర్మగూడకు చెందిన మహ్మద్‌‌ అసన్‌‌ ‌‌ఉల్లా ఖాన్‌‌ (40)డెడ్‌‌బాడీ లభ్యం.

కరెంట్‌‌షాక్‌‌తో మృతి చెందిన వారు

సరూర్‌‌‌‌నగర్‌‌‌‌:పీ అండ్‌‌ టీ కాలనీలో అర్జిత్‌‌(3).

బంజారాహిల్స్‌‌: డాక్టర్‌‌‌‌ సతీష్‌‌కుమార్‌‌‌‌రెడ్డి(49).

అంబర్‌‌‌‌పేట్‌‌: రాజ్‌‌కుమర్‌‌(33).

అమీర్‌‌‌‌పేట్‌‌: గోల్డెన్‌‌ కేఫ్‌‌ అండ్‌‌రెస్టారెంట్‌‌ వద్ద గంటా శ్రీనివాస్‌‌(46).

ఎల్‌‌బీనగర్‌‌‌‌: బైరామల్‌‌గూడ సాగర్‌‌ ‌‌ఎన్‌‌క్లేవ్‌‌లో కాసోజు నారాయణ చారి(36).

మలక్‌‌పేట్‌‌:  ప్రశాంత్‌‌ నగర్‌‌‌‌లో వాచ్‌‌మెన్‌‌ కోరుమిల్లి పోషయ్య(41).

For More News..

హైదరాబాద్‌లో ఇంకా నీటిలోనే 800 కాలనీలు

అలర్ట్​ చేసింది లేదు..  ఆదుకున్నదీ లేదు