Diwali Special : దీపావళి వెలుగుల పండగ.. దీపాలు వెలిగించేందుకు నియమాలు ఇవే.. తప్పక తెలుసుకోండి.. !

Diwali Special : దీపావళి వెలుగుల పండగ.. దీపాలు వెలిగించేందుకు నియమాలు ఇవే.. తప్పక తెలుసుకోండి.. !

దీపావళి అంటే దీపాల పండుగ.. వెలుగుల పండుగ.. ఆశ్వయుజమాసం అమావాస్య రోజు దీపాలు వెలిగించాలని యుగ యుగాలనుంచి వస్తున్న సంప్రదాయం.. ఆచారం.  దీపావళి రోజున దీపాలు వెలిగించేందుకు ఓ పద్దతి.. కొన్ని నియమాలు ఉన్నాయంటున్నారు పండితులు..  ఈ స్టోరీలో దీపావళి రోజున  దీపాలు ఎలా వెలిగించాలో తెలుసుకుందాం. . !

పురాణాల ప్రకారం ఆశ్వయుజమాసం అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం. ఈ ఏడాది అక్టోబర్​ 20 వ తేదీన దీపావళి.. దీపాల పండుగ వచ్చింది.  ఆరోజున సాధారణంగా లక్ష్మీదేవిని భక్తి శ్రద్దలతో పూజించి...  సాధ్యమైనన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తారు.  ఆ తరువాత  పిల్లలు.. పెద్దలు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకుంటారు.  

దీపాలు ఎలా వెలిగించాలంటే..

  • దీపావళి రోజున ప్రమిదలో నూనె పోసి  ఒత్తులు వేసి దీపం వెలిగించాలి.  ముందుగా అగర్​ బత్తీని వెలిగించి దానితో వెలిగించాలి.  దీపం పెట్టే ప్రదేశంలో ఆసనం వేయాలి.  ఆ ప్రమిదను  మరో ప్రమిదలో కాని.. ఆకు కాని.. వేసి దానిపై దీపం పెట్టాలి.  దీపం దగ్గర కుంకుమ.. అక్షింతలతో అలంకారం చేయాలి. 
  • దీపంలో నూనెను నిండుగా పోయకూడదు. దీని వల్ల అది పొంగి నూనె బయటికివచ్చే అవకాశం ఉంటుంది.. ఇది దైవశక్తికి అవమానంగా భావిస్తారని నిపుణులు చెబుతున్నారు. కావాలంటే మరోసారి వెలుగుతున్న దీపంలో నూనెను పోయవచ్చు. 
  • దీపాల నుండి నూనె వృథాగా కిందపడిపోవడం అంటే ధనం వృథా కావడం వంటిదని పండితులు చెబుతున్నారు. . ఇది లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పిస్తుందట.. దీపంలో నూనె పొంగడం వల్ల ఆర్థిక నష్టాలు, ఇంటి ఆర్ధిక స్థితిలో ఒడుదుడుకులుకలిగే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు.
  • దీపావళి రోజున దీపాన్ని  తూర్పు దిశలో,  ఉత్తర దిశలో దీపం వెలిగించాలని నిపుణులు చెబుతున్నారు. నేతి దీపంలో పత్తి వత్తిని ఉంచి వెలిగించాలని చెబుతున్నారు. నూనె దీపంలో ఎర్ర దారం వత్తిని ఉపయోగించాలని సూచించారు. . దీపావళి రోజున పగిలిన , పాత దీపాలను వెలిగించకూడదని చెబుతున్నారు.
  • ఇంటి ప్రధాన ద్వారం వద్ద గదిలో, వంటగదికి ఆగ్నేయ మూలలో, తులసి మొక్క దగ్గర, టెర్రస్/బాల్కనీలో దీపం వెలిగించండి.
  •  ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపం  జ్వాల లోపలికి ఎదురుగా ఉండాలి.
  • దీపావళికి కచ్చితంగా వంటగదిలో దీపం వెలిగించాలి.  దీనివల్ల  అన్నపూర్ణాదేవి అనుగ్రహం  మీకు కచ్చితంగా లభిస్తుంది. వంటగదిలో దీపం పెట్టడం మీ పొలాల్లో  పంటలు బాగా పండుతాయి. ఆహారానికి ఎలాంటి కొరత ఉండదు. రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం జీవితాంతం లభిస్తుంది. 
  • ఇంట్లో తులసి మొక్క దగ్గర ఉంటే కచ్చితంగా దీపం వెలిగించండి. తులసి దగ్గర పెడితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. దీని వల్ల ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, సంతోషం పెరుగుతాయని అంటారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని .. ఆధ్యాత్మిక వేత్తల సలహాలతో పాటు.. పురాణాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు.