థీసిస్ సబ్మిషన్ గడువు పొడిగించాలి

థీసిస్ సబ్మిషన్ గడువు పొడిగించాలి
  •  ఓయూ వీసీ చాంబర్ ఎదుట పీడీఎస్​యూ ఆందోళన

ఓయూ,వెలుగు: పీహెచ్ డీ  థీసిస్​సబ్మిషన్ గడువు పెంచాలని డిమాండ్​చేస్తూ రీసెర్చ్​స్కాలర్లు ఆందోళనకు దిగారు.  పీడీఎస్ యూ ఆధ్వర్యంలో బుధవారం వీసీ చాంబర్​ఎదుట స్కాలర్స్  బైఠాయించారు. పీడీఎస్​యూ నేత నాగేశ్వర్​రావు మాట్లాడుతూ..  2017 బ్యాచ్​కు చెందిన విద్యార్థులకు  ప్రీ- సబ్మిషన్ కు 3 నెలల గడువు ఉండగా పది రోజులు మాత్రమే ఇచ్చారని, అంత తక్కువ సమయంలో  థీసిస్​ను  పూర్తి చేయ లేమని  రీసెర్చ్ స్కాలర్స్ ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.

ప్రి సబ్మిషన్ సందర్భంగా వచ్చిన సజేషన్స్ పై వర్క్స్ చేయడానికి, యాంటి ప్లాగరిజిం చెక్ చేసుకోవడానికి, ప్లాగరిజం రిపోర్ట్ మీద వర్క్స్ చేయడానికి కనీసం 3 నెలల కంటే ఎక్కువ సమయం పడుతుందని, కేవలం 10 రోజులు మాత్రమే గడువు ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఓయూలో మాత్రమే రీసెర్చ్ కు డెడ్ లైన్ పెట్టడం యాంటి అకాడమిక్ చర్యల్లో భాగమే అని, వీసీ వెంటనే సానుకూల నిర్ణయ తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పీడీఎస్ యూ నేతలు ప్రశాంత్, సతీష్, క్రాంతి, పర్వేజ్ కమల్, సుమన్ పాల్గొన్నారు.